ఓటీటీ పుణ్యమా అని దొంగతనం గురించి తెలుసుకున్న ఎన్నారై.. ఎలాగంటే..?

టెక్నాలజీ( Technology ) వల్ల నష్టాలే కాదు చాలా లాభాలు కూడా ఉంటాయి.

రకరకాల సాంకేతికాలు ఎంతోమంది నేరగాలను పట్టించాయి.ఇప్పటికీ పట్టిస్తూనే ఉన్నాయి తాజాగా ఒక ఎన్నారైని మోసం చేసిన దొంగలను పట్టించడంలో కూడా టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది.

ఆ వివరాలు తెలుసుకుందాం. """/"/ 2020, డిసెంబరులో దినేష్ మంచాండా అనే ఒక భారతీయుడు తన కుటుంబంతో కలిసి కెనడా( Canada )కు వెళ్లాడు.

అంతకంటే ముందు గురుగ్రామ్‌లోని తన ఇంటిని విక్రయించి, తన వస్తువులను సురక్షితమైన స్థలంలో భద్రపరచమని కొంతమంది స్నేహితులను కోరాడు.

కానీ అతని స్నేహితులు అతన్ని మోసం చేసి అతనికి చెందిన రూ.60 లక్షల విలువైన వస్తువులను దొంగిలించారు.

వారు 20-25 లక్షల విలువైన కొన్ని వస్తువులను జంక్ డీలర్‌కు విక్రయించారు.అంతా బాగానే ఉందని దినేష్‌కు అబద్ధం చెప్పారు.

తన టీవీలో ఓటీటీ అకౌంట్‌( OTT Account )ని ఎవరో వాడుతున్నట్లు దినేష్ ఒకానొక ఒక సందర్భంలో గుర్తించాడు.

తన టీవీని ఎవరు వాడుతున్నారు? అసలు అది ఎవరి వద్దకు వెళ్ళింది? అనే అనుమానాలు అతడిలో మొదలయ్యాయి.

ఆ అనుమానంతో స్టోరేజీ( Storage ) సదుపాయాన్ని పరిశీలించమని మరో వ్యక్తిని అడిగాడు.

అలా ఆరా తీసిన అతనికి తన స్నేహితులు పాత, విరిగిన వస్తువులతో స్టోరీజీని నింపేసి విలువైన వస్తువులన్నీ కాజేశారని తెలిసింది.

దాంతో షాక్ తిన్న దినేష్ అనంతరం వారి ఫ్రెండ్స్ ని నిలదీశాడు.వారు అతని వస్తువులలో కొన్నింటిని తిరిగి ఇచ్చారు.

అతనికి 3 చెక్కులను కూడా ఇచ్చారు, కానీ తప్పు సంతకం కారణంగా అవి బౌన్స్ అయ్యాయి.

దాంతో తాను బాగా మోసపోయానని దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. """/"/ ఒక రిపోర్ట్ ప్రకారం, ఈ కుంభకోణానికి పాల్పడిన ఇద్దరు నిందితులు రాజేష్ కుమార్, రాకేష్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి చోరీకి గురైన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.వారి వద్ద నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు చేసిన జంక్ డీలర్‌( Dealer )ను కూడా గుర్తించారు.

పరారీలో ఉన్న మూడో నిందితురాలు పూజాసింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.నిందితులు దినేష్ ఇంటిని అతనికి తెలియకుండా మరొకరికి విక్రయించడానికి నకిలీ ఐడీలు, పత్రాలను( Fake ID Documents ) ఉపయోగించినట్లు కూడా పోలీసులు కనుగొన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. మంచి హీరో అంటూ?