అంబటి అర్జున్.. కేవలం ఆటగాడు మాత్రమే కాదు.. విన్నర్ కూడా !

బిగ్ బాస్ ( Big Boss )ఎప్పుడైతే వైల్డ్ కార్డు ఎంట్రీలను ఒకేసారిగా ఎక్కువమందిని దించిందో అప్పుడే తన స్ట్రాటజీ పక్కగా అమలు చేయడం మొదలుపెట్టింది.

అసలే టిఆర్పి లేక చప్పబడిపోయినా బిగ్ బాస్ సీజన్ 7 ని ఉర్రూతలూగించడానికి కాస్త అందం మరియు తెలివి కలగలిపి మిక్స్ చేస్తూ తన నెక్స్ట్ గేమ్ ప్లాన్ కొనసాగిస్తున్నాడు బిగ్ బాస్.

అశ్విని, నయని పావని వంటి అందాల భామలతో పాటు అర్జున్, పూజా వంటి తెలివైన కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా రావడం విశేషం.

వాస్తవానికి పూజా తన తండ్రిని కోల్పోవడంతో మొదటిసారి హౌస్ లోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయింది కానీ వైల్డ్ కార్డు ఎంట్రీగా మరోసారి ఆమెకు అవకాశం వచ్చింది.

ఇక అందరూ అంబటి అర్జున్( Ambati Arjun ) కూడా మొదటిసారి వస్తాడని ఊహించిన ఎందుకో తెలియదు అంబటి అర్జున్ సైతం వైల్డ్ కార్డు ఎంట్రీ గాని రంగంలోకి దిగాడు.

"""/" / రెండవ దఫా ఎంట్రీ ఇచ్చిన అందరిలో కెల్లా అంబటి అర్జున్ చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాడు.

తన ప్రాణ మిత్రుడైన అమర్ దీప్( Amar Deep ) ని కూడా నామినేట్ చేసి తన తప్పులను వేలెత్తి చూపుతూ అదే సమయంలో అతనిలో ఆలోచనలు కలిగించే ప్రవర్తన ఉండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.

పైగా అర్జున్ ఆట తీరు కూడా చాలా స్పష్టంగా, క్లియర్ గా నిజాయితీతో కూడిన విధంగా కనిపిస్తుంది.

తన తోటి హౌస్ మేట్స్ కి ధైర్యాన్ని నింపుతూ తాను కూడా ఆడుతున్న పద్ధతి ఎంతో బాగా ప్రేక్షకులను అలరిస్తుంది.

పైగా ఆటగాళ్లు పోటుగాళ్లు అంటూ పాత ప్లేయర్స్ ని కొత్త ప్లేయర్స్ ని విడదీసి ఆడిస్తున్నప్పటికీ వాళ్ళలో చక్కటి సమన్వయం కూడా అర్జున్ వల్లే సాధ్యమవుతుంది.

"""/" / ఇదే విధంగా తెలివితో కూడిన అలాగే ఆలోచనతో కూడిన ఆట అర్జున్ ముందుకు వెళ్లడానికి చక్కగా ఉపయోగపడతాయి.

అంతేకాదు హౌస్ మేట్స్ అందరిలో కెల్లా అతని స్వభావం భిన్నంగా కనిపిస్తోంది కచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశం మెండుగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది.

మరి రానున్న రోజుల్లో బిగ్ బాస్ పెట్టి పరీక్షల్లో అర్జున్ ఎలా నెగికొస్తాడో లేడో తెలియదు.

కానీ ఇప్పటికైతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో అర్జున్ కూడా ఖచ్చితంగా ఒకటిగా ఉన్నాడు.

ఖైదీలను సింహాలకు ఆహారంగా వేసేవాడు.. ఎక్కడో తెలిస్తే..