ఇండియన్ సినిమాలలో అది మిస్ అయ్యింది అంటున్న ఆస్కార్ అధ్యక్షుడు

ఇండియాలో ప్రతి సంవత్సరం అన్ని భాషలలో కలిసి వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.

అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు రాలేదు.అయితే ఇండియా సంస్కృతి ఆధారంగా హాలీవుడ్ దర్శకులు తెరకెక్కించిన స్లమ్ డాగ్ మిలీనియర్ లాంటి సినిమాలకి మాత్రం ఆస్కార్ వచ్చింది.

అసలు ఇండియన్ దర్శకులు ఆస్కార్ ప్యానల్ ని మెప్పించే సినిమాలు తీయలేకపోతున్నారా.లేక ఆస్కార్ కమిటీ ఇండియన్ సినిమాని చిన్న చూపు చూస్తుందా అనేది ఇప్పటికి అర్ధం కాని విషయం.

దీనిపై తాజాగా ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ ఇండియా వచ్చిన సందర్భంగా ఆసక్తికర వాఖ్యలు చేసారు.

నా అభిప్రాయంలో ప్రకారం భారతీయ సినిమా చాలా గొప్పది భారత్‌ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి.

మాకు బాలీవుడ్‌ నుంచి విడుదలయ్యే మ్యూజికల్‌ సినిమాల ద్వారానే భారతీయ సినిమాల గురించి తెలుస్తుంది.

కానీ వాటిలో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులు గురించి మాట్లాడుకునేంత గొప్ప అంశాలు ఇప్పటి వరకు కనిపించ లేదు.

ఓ విధంగా చెప్పాలంటే మాకు ఇండియా నుంచి వచ్చిన సినిమాలల్లో ఇప్పటి వరకు భారతీయత గురించి తెలియనే లేదు.

ఇండియన్ సినిమా అంటే ఇది అని చెప్పుకునేంత గొప్ప సినిమా ఇక్కడి నుంచి రాలేదు.

అలా తెలియలేదంటే తప్పు ఇక్కడే ఉంది అని, ప్రపంచానికి మీ విలువను తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించాల్సిన బాధ్యత మీపై ఉంది.

ఆస్కార్ కూడా అలాంటి సినిమాలనే గుర్తించి అవార్డులు ఇస్తుంది అని చెప్పి మన దర్శకుల టాలెంట్ ఎంత అద్వానంగా ఉందో అనే విషయాన్ని బెయిలీ చెప్పుకొచ్చారు.

వామ్మో, ఇదేంది.. ఇండియన్ ట్రైన్ ఎక్కి బ్రిటిష్ యూట్యూబర్ షాకింగ్ పని.. సిగ్గుపడాలంటూ!