అమెరికా : రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల మరణం .. ఎట్టకేలకు స్వదేశానికి తమిళ సంతతి చిన్నారి
TeluguStop.com
మే 2022లో అమెరికాలోని మిస్సిస్సిప్పిలో( Mississippi ) ప్రాణాలు కోల్పోయిన తమిళనాడు దంపతులకు( Tamil Nadu Couple ) చెందిన మూడేళ్ల బిడ్డ.
ఇవాళ చెన్నైకి( Chennai ) చేరుకోనుంది.సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఆ చిన్నారి బంధువు ఆమెను కస్టడీలోకి తీసుకుంది.
ఆ బాబు చెన్నైకి తన బంధువులతో వచ్చినప్పుడు మధురై, తిరుచ్చి జిల్లాలకు చెందిన తన తల్లిదండ్రులలో ఒకరి స్వస్థలానికి వెళ్లే అవకాశం వుంది.
ఆ బాబు ఓసీఐ కార్డుదారుడు.ప్రవాస తమిళుల పునరావాస సంక్షేమ కమిషనరేట్ , నాన్ రెసిడెంట్ తమిళుల సంక్షేమ బోర్డు, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ ప్రవాసులు, అమెరికాలోని పలు తమిళ సంఘాల ప్రతినిధులు .
పిల్లవాడి బంధువులతో సమన్వయం చేసుకుంటున్నారు. """/" /
తాము సంబంధిత జిల్లా స్థాయి అధికారుల ద్వారా క్రమ వ్యవధిలో పిల్లలను తనిఖీ చేస్తామని నాన్ రెసిడెంట్ తమిళ సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ కార్తికేయ శివసేనాపతి( Karthikeya Sivasenapathy ) ది హిందూకు వెళ్లడించారు.
అతని తల్లిదండ్రుల మరణం తర్వాత మిస్సిస్సిప్పిలోని చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ (సీపీఎస్)( Child Protective Service ) 2022లో పిల్లవాడిని కస్టడీలోకి తీసుకుంది.
చిన్నారి యోగక్షేమాలను తాత్కాలికంగా చూసుకోవడానికి ఒకరికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు అధికారులు.
ఇంతలో బిడ్డ అత్త తన మేనల్లుడిని తనకు అప్పగించాలని న్యాయపోరాటం ప్రారంభించింది. """/" /
ఈ వివాదం స్థానిక కోర్టుకు వెళ్లిన తర్వాత.
తమిళనాడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ( Tamil Nadu Child Welfare Committee ) నుంచి నివేదిక సమర్పించారు.
అయితే పిల్లల తాత్కాలిక సంరక్షణ మరొక కుటుంబం వద్ద వుండటం చిక్కుముడిగా మారింది.
అమెరికా పర్యటనలో భాగంగా శివసేనాపతి భారతీయ అత్తకు ఎలా సహాయం చేయాలనే దానిపై అక్కడి ఎన్ఆర్ఐలతో చర్చలు జరిపారు.
కానీ ఎట్టకేలకు ఆమె పిల్లల సంరక్షణను పొందింది.తన మేనల్లుడి బాధ్యతలను చట్ట ప్రకారం సొంతం చేసుకున్న అతని మేనత్త హర్షం వ్యక్తం చేశారు.
ఈ న్యాయపోరాటంలో తనకు అండగా నిలిచిన అధికారులు, ప్రవాస తమిళ సంఘాలు, ఎన్ఆర్ఐలు, న్యాయస్థానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పెళ్లి కూతురైన బిగ్ బాస్ బ్యూటీ… హల్దీ ఫోటోలు వైరల్…షాక్ లో ఫ్యాన్స్?