తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రమే ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిస్తారు.
ఇలా తనదైన హావా భావాలతో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ ఒక వెలుగు వెలిగారు బాబు మోహన్.
ఇక కొన్ని సినిమాల్లో బాబు మోహన్ హీరోగా కూడా నటించడం గమనార్హం.అయితే కేవలం సినిమాల్లోనే కాదు అటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.
కేసిఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.అయితే సాధారణంగా రాజకీయ నాయకుల స్థానికత ఏంటి అన్న దాని గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ స్థానికత పై గత కొన్ని రోజుల నుంచి ఎన్నో ఊహాగానాలు అందరినీ అయోమయంలో పడేస్తున్నాయి.
బాబు మోహన్ స్థానికతపై ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం నోరు విప్పలేదు.
బాబు మోహన్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు అని కొంతమంది చెబుతుంటే.లేదు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వాడు అని మరికొంతమంది అన్నారు.
బాబు మోహన్ స్థానికత అందరికీ ఒక చిక్కుముడి గా మారిపోయింది. """/" /
అయితే ఇటీవలే స్థానికతపై నోరువిప్పిన బాబు మోహన్ అందరికీ క్లారిటీ ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహించగా.ఈ కార్యక్రమానికి హాజరయ్యారు బాబు మోహన్.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన సొంత ఊరు మహబూబాబాద్ అంటూ కుండబద్దలు కొట్టి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేశారు.
ఇలా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం భోజన్నపేట పుట్టిన గ్రామం తన గ్రామం అంటూ బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025