నేల సాగు కన్నా బ్యాగు సేద్యంలోనే అధిక దిగుబడి..!

ఆరు బయట పొలాల్లో సేంద్రీయ కూరగాయల( Organic Vegetables ) బ్యాగు సేద్యంతో మంచి దిగుబడి సాధించవచ్చు.

నేలపై సాగు చేస్తే వచ్చే దిగుబడికి రెట్టింపు స్థాయిలో బ్యాగులో చేసే సేద్యం వల్ల సాధించవచ్చు.

బ్యాగు సాగులో టమాటాలు, క్యాబేజీలు, పుదీనా, కాకర లాంటి అన్ని కూరగాయలు సాగు చేయవచ్చు.

"""/" / కాకర పంట( Bitter Gourd Crop )ను ఎత్తు బెడ్లపై సాగు చేస్తే ఎకరాకు సుమారుగా నాలుగున్నర టన్నుల దిగుబడి వరకు సాధించవచ్చు.

అలాకాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో ఈ కాకరను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు 8 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు.

ఇప్పుడు బ్యాగు సేద్యం చేసే విధానం గురించి తెలుసుకుందాం. """/" / ఈ బ్యాగు సేద్యాన్ని పాలిథిన్ బ్యాగులు అవసరం.

అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగులలో 15 కిలోల పశువుల ఎరువు, 15 కిలోల ఎర్ర మట్టి, 100 గ్రాముల వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపాలి.

ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని ఈ పాదులలో పోయాలి.రాజ్మా గింజల ద్రావణం, కొబ్బరి నీరును నాలుగు లేదా ఐదు సార్లు పిచికారి చేయాలి.

ఏవైనా లీఫ్ బ్లైట్ వంటి తెగులు సోకితే సేంద్రీయ పద్ధతిలో నియంత్రించడానికి ప్రయత్నించాలి.

ఒక ఎకరం స్థలంలో 6000 బ్యాగులు అవసరం.ఈ పద్ధతిలో సాగు చేస్తే కలుపు సమస్యలు చాలా తక్కువ.

కాబట్టి వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశించడానికి అవకాశం ఉండదు.ఈ బ్యాగు సేద్యం గురించి విన్న రైతులు( Farmers ) ఈ విధానంలో సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

కాకపోతే పెట్టుబడి కాస్త పెరిగిన దిగుబడి మాత్రం ఆశించిన స్థాయిలో ఉంటుందని వ్యవసాయ క్షేత్రం నిపుణులు చెబుతున్నారు.

లడ్డు కల్తీ వ్యవహారం… పవన్ వెనుక ఉన్నది ఆయనే రోజా సంచలన వ్యాఖ్యలు!