వ్యవసాయ నేలలో సారం పెంచేందుకు సేంద్రీయ పద్ధతులు..!

వ్యవసాయం( Agriculture ) చేసే రైతులందరూ అధిక దిగుబడి సాధించడం కోసం ఎక్కువగా రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందులను అధిక మొత్తంలో ఉపయోగిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల ప్రస్తుతం దిగుబడి బాగానే ఉంటుంది.కానీ నేల తన సారాన్ని కోల్పోతుంది.

ప్రతి సంవత్సరం నేల సారాన్ని కోల్పోతూ చివరికి వ్యవసాయం చేయడానికి నేల పనికి రాకుండా పోతుంది.

అధిక దిగుబడి( High Yield ) సాధించిన పంటలో కూడా నాణ్యత లోపం ఏర్పడుతుంది.

కాబట్టి వ్యవసాయ రైతులు రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో నేల సారాన్ని ఎలా పెంచాలో అనే విషయాలలో అవగాహన కల్పించుకుంటేనే నాణ్యమైన అధిక దిగుబడి సాధించడంతోపాటు నేల సారాన్ని కూడా పెంచవచ్చు.

"""/" / భూమిలో పంట కోతలు పూర్తి అయిన తర్వాత పొలంలో సూక్ష్మజీవులను( Micro Organisms ) వృద్ధి చేయడం కోసం జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పంటలు వేయాలి.

ఈ పంటల వల్ల నీరు భూమిలోకి ఇంకిపోతుంది.తద్వారా సూక్ష్మజీవుల వల్ల నేల సారం పెరుగుతుంది.

ఈ పంటలను పచ్చరొట్ట ఎరువుల పంటలు అంటారు.ఈ పంటలను కాల ప్రారంభంలో వేసుకుని, పొలాన్ని కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది.

తర్వాత నేలలో ఏ పంట వేసినా అధిక దిగుబడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి.

పైగా ఈ జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పంటలు వేయడానికి పెట్టుబడి కూడా ఎక్కువగా అవసరం ఉండదు.

ఈ పంటలు వేసిన పొలాలలో ఇతర ఎరువులు తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. """/" / కాబట్టి రసాయన ఎరువులకు అతి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇక పంట పొలంలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకి పంట పొలం నుండి దూరంగా వేస్తే దాదాపుగా చీడపీడల బెడద, తెగుళ్ల బెడదను అరికట్టినట్టే.

ఇలాంటి మెలుకువలతో వ్యవసాయం చేస్తే పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి పొందవచ్చు.

పైగా నేల కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.ఈ పద్ధతులతో దశలవారీగా దిగుబడి పెరుగుతుంది.

మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం.. సహకరించండి.. చిరంజీవి పోస్ట్ వైరల్!