అవయవ దానం చేసి నలుగురు జీవితాల్లో వెలుగులు

యాదాద్రి భువనగిరి జిల్లా: పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా కన్నీటి శోకాన్ని కంట్రోల్ చేసుకొని బ్రెయిన్ డెడ్ అయిన తమ కుటుంబ సభ్యుని అవయవాలు దానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో పలువురికి ఆదర్శంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే.రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రాస అశోక్ (39) గత మూడు రోజుల క్రితం జరిగిరిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డేట్ అయి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అశోక్ మరణం ఊరికే పోకుండా మరో నలుగురి జీవితాలకి వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ,కుటుంబ సభ్యుల అనుమతి, సహకారంతో మృతుడి అవయవాలు దానం చేసి మరొకొన్ని కుటుంబాలలో వెలుగులు నింపడానికి ముందుకొచ్చారు.

దుఃఖ సంద్రంలో ఉన్న కుటుంబం ముందుకు వచ్చి అవయవ దానానికి సహకరించిన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూస బాలకిషన్ ప్రగాఢ సానుభూతి తెలిపి, కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం హాస్పటల్ వారు అధికారిక లాంచనలాతో గౌరవ వందనం స్వీకరించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి,డాక్టర్లు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

నలుగురితో నవ్వుతూ మాట్లాడే అశోక్ మరణం జీర్ణించుకోలేని గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తెలుగు లో ఈ ఇద్దరు దర్శకులకు మాత్రమే 100% సక్సెస్ రేట్ ఉందా..?