వాహనదారులకు శుభవార్త… కేవలం రూ. 38,000కే ఎలక్ట్రిక్ స్కూటర్!
TeluguStop.com
వాహనదారులు మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ వాహనాలవైపుకి మళ్లుతున్నారు.రానురాను పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో పైసా ఖర్చు లేని ఎలక్ట్రిక్ వాహనాలు( Electric Vehicles ) ఎంతో ఉత్తమం అని ఫీల్ అవుతున్న పరిస్థితి.
అందుకే నేడు ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్ ఈవిలను పరిచయం చేస్తున్నాయి.
ఇక సామాన్యుడు కూడా కొనే విధంగా కొన్ని కంపెనీలు కనీస ధరలకే వీటిని మార్కెట్లోకి తెస్తున్నాయి.
మీరు కూడా లోకల్ అవసరాల కోసం మంచి బైక్ కోసం ఎదురు చూస్తే ఈ వార్త మీ కోసమే.
"""/" /
తాజాగా ఒరేవా ఎలక్ట్రిక్( Oreva ) లోస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది.
దాని పేరు ఒరేవా ఆదిదేవ్ ఎలక్రిక్ స్కూటర్.( Oreva Adidev ) మన దేశీయ రోడ్లకు ఇది చక్కగా సరిపోయే స్కూటర్.
పైగా లో బడ్జెట్లోనే లభ్యమవుతోంది.డిజైన్, లుక్.
పరంగా చిన్నగా క్యూట్ గా కనిపిస్తుంది.ఈ స్కూటర్ పై ఇద్దరు ప్రయాణించగలుతారు.
అందుకు తగిన సీటింగ్ కూడా అమర్చారు.ముందు వైపు నుంచి చూస్తే కాస్త స్కూటీ పెప్ ప్లస్ లుక్ లో కనిపిస్తుంది.
"""/" /
దీని ఫీచర్ల విషయానికొస్తే.ఎత్తు 1030ఎంఎం, పొడవు 1750ఎంఎం, వెడల్పు 670ఎంఎం ఉంటుంది.
కాగా బరువు కేవలం 75 కేజీలు మాత్రమే.10 లీటర్ సామర్థ్యంతో స్టోరేజ్ బాక్స్ సీటు కింద ఉంటుంది.
అధిక సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ తో దీనిని తయారు చేయడం విశేషం.కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే రెండు కలర్ ఆప్షన్స్ బ్లూ, రెడ్ లో లభ్యమవుతుంది.
మోటార్ 500వాట్స్ సామర్థ్యం, బ్యాటరీ 48V, 24Ah సామర్థ్యంతో ఉంటుంది.గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుతుంది.
‘ రా ’ ఏజెంట్‌నంటూ ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం .. వెలుగులోకి జిమ్ ట్రైనర్ బాగోతం