మాములు తెలివి కాదు.. మ్యాన్‌హోల్స్‌లో పడిపోయినా ప్రాణాలు పోకుండా ఉండేందుకు..

ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది.నైరుతి రుతుపవనాల( Southwest Monsoon ) ప్రభావంతో దేశవ్యాప్తంగా వానలు పడుతున్నాయి.

ఉత్తరాదిలో భారీ వర్షాలు విలయతాండవం సృష్టిస్తున్నాయి.అతి భారీ వర్షాలతో కార్లు కొట్టుకుపోవడం, చెట్లు విరిగిపోయి నేలకొరగడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అయితే వర్షాకాలం వచ్చిందంటే మ్యాన్‌హోల్స్ ( Manholes ) వర్షపు నీటితో నిండిపోయి రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి.

దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. """/" / అయితే ఒక వ్యక్తి వర్షపు నీళ్లల్లో తడవకుండా ఎలా నడవాలనే దానిపై కొత్త ఐడియా కనిపెట్టాడు.

ఢిల్లీలో( Delhi ) భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు.రోడ్లపైకి భారీగా నీళ్లు చేరుకోవడంతో నడవలేని పరిస్థితి నెలకొంది.

దీంతో ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు.వాక్యూమ్ క్లీనర్ ( Vacuum Cleaner ) తో రోడ్డుపైకి చేరుకున్నాడు.

మిషన్ ఆన్ చేయగానే ఆ గాలికి నీళ్లన్నీ చెల్లాచెదురుగా జరిగి పక్కకు పోయాయి.

దీంతో ఆ వ్యక్తి హాయిగా నడుచుకుంటూ వెళుతున్నాడు.రోడ్డుపై వర్షపు నీటితో ఇబ్బంది పడకుండా ఆ వ్యక్తి కనిపెట్టిన ఈ ట్రిక్ అందరినీ ఆకర్షిస్తోంది.

ఆ వ్యక్తి బూట్లు తడవకుండా కొత్త ట్రిక్ ఉపయోగించి రోడ్డుపై వెళుతుండగాకొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.అందరూ అతడిని మొచ్చుకుంటున్నారు.

"""/" / వర్షాకాలంలో రోడ్డుపై ఉండే మ్యాన్ హోల్స్ కనబడక చాలామంది అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ వ్యక్తి కనిపెట్టిన ఐడియా వల్ల మ్యాన్ హోల్స్ ను కూడా గుర్తించవచ్చు.

ఈ వ్యక్తి తెలివితేటలకు అందరూ ఫిదా అయిపోతున్నారు.మ్యాన్ హోల్స్ ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మరికొందరు వార్వెవా ఏం తెలివయ్యా సామీ అంటూ కితాబిస్తున్నారు.

నా కూతురును దారుణంగా ట్రోల్ చేశారు.. ట్రోలర్స్ పై మండిపడిన రాజీవ్ కనకాల?