ఆన్‌లైన్‌లో రెసిన్ లాకెట్‌ను ఆర్డర్ చేసింది.. బదులుగా ఏమొచ్చిందో చూసి షాక్..!
TeluguStop.com
ఆన్‌లైన్‌లో వస్తువులను కొనాలనుకున్నప్పుడు ట్రస్టెడ్ సైట్స్( Trusted Sites ) ని మాత్రమే నమ్మాలి.
చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలి.అలా కాదని కొంటే చివరికి షాక్ తినే పరిస్థితి వస్తుంది.
యూకేకి చెందిన బెల్లా మోస్కార్డిని అనే యువతకి ఇలాంటి ఒక షాకింగ్ అనుభవమే ఎదురయింది.
ఆమె టెము అనే చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం నుంచి ఓ లాకెట్‌ను కొనుగోలు చేసింది.
బదులుగా ఆ కంపెనీ వేరేది పంపించడంతో ఆమె నోరెళ్లబెట్టింది.ఆ నెక్లెస్ తనను ఎంతగా భయపెట్టిందో ఆమె తన టిక్‌టాక్ వీడియోలో తెలిపింది.
కేవలం 57 పెన్స్ (సుమారు రూ.60) ఖరీదు చేసిన ఆ నెక్లెస్ ఆమెను చాలా బాధకు గురిచేసింది.
బెల్లా ఒక కాస్ట్యూమ్ కోసం ప్లాస్టిక్ దంతంతో కూడిన లెదర్ నెక్లెస్‌ను ( Leather Necklace )కొనుగోలు చేసింది.
కానీ దానిని అందుకున్నప్పుడు ఆమె భయభ్రాంతులకు గురైంది.ఆ నెక్లెస్ నుంచి చాలా బలమైన, అసహ్యకరమైన వాసన వస్తుంది.
దాన్ని పరిశీలించిన తర్వాత, ఆ రెసిన్ దంతం నిజానికి ఒక కుక్క దంతం అని బెల్లా అనుమానించింది.
వెబ్‌సైట్‌లో ఆ పెండెంట్‌ను "రెసిన్" ( Resin )అని వర్ణించినా దానిని పంపించలేదు, రెసిన్‌తో ఆభరణాల తయారు చేసే బెల్లాకు ఏదో తప్పే జరిగిందని అనిపించింది.
ఆమె దాన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది. """/" /
నెక్లెస్ తనను ఎంతగా ఆశ్చర్యపరిచిందో తన టిక్‌టాక్ వీడియోలో పంచుకుంది.
తాను "వుడ్‌స్టాక్ హిప్పీస్" ( Woodstock Hippies )కాస్ట్యూమ్ కోసం ఆ నెక్లెస్‌ను ఉపయోగించాలని బెల్లా ముందుగా భావించింది.
అది రెసిన్ పెండెంట్ అని వెబ్‌సైట్‌లో వ్రాసి ఉండటంతో ఆమె దాన్ని నమ్మారు.
కానీ, ఆ నెక్లెస్ నుంచి వచ్చిన చెడు వాసన ఆమె ఆలోచనను మార్చివేసింది.
నిజమైన రెసిన్‌కు వాసన ఉండదని, అలాంటి వాసన రాదని బెల్లా తెలిపారు. """/" /
ఆ ప్రొడక్ట్ లిస్టింగ్‌లో అసమానతలను కూడా ఆమె గమనించింది.
వెబ్‌సైట్‌లోని పెండెంట్ చిత్రాలు వేర్వేరు దంత డిజైన్లను కలిగి ఉన్నాయి, దీనివల్ల ఆ పెండెంట్‌లు నిజమైన దంతాల నుంచి వచ్చాయేమో అని అనుమానం వచ్చింది.
బెల్లా లైటర్‌తో ఆ పెండెంట్‌ను కాల్చి పరీక్షించింది.అది కరిగిపోలేదు, దాని నుంచి వచ్చిన వాసన తట్టుకోలేనిదిగా ఉంది.
అది ప్లాస్టిక్ కాదని, నిజమైన కుక్క దంతంలా కనిపిస్తుందని ఆమె ముగించింది.బెల్లా ఆ నెక్లెస్‌ను విసిరివేసి, టెములో నెగటివ్ రివ్యూ ఇచ్చింది.
ఆ ప్రొడక్ట్‌పై చాలా రివ్యూలు పాజిటివ్‌గా ఉండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.అవన్నీ ఫేక్ రివ్యూస్ అయి ఉండొచ్చని ఆమె తెలిపింది.
ఓరినాయనో, ఒక్క సంవత్సరంలోనే రూ.367 కోట్లు సంపాదించిన అడల్ట్ స్టార్.. ఈమె స్టోరీ వింటే..?