గాయాన్ని మొక్కతో నయం చేసుకుంటున్న ఒరంగుటాన్.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు..

ఇండోనేషియా( Indonesia )లోని దట్టమైన అడవుల్లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది.జంతువులు సొంతంగా వాటి రోగాలకు, గాయాలకు వైద్యం ఎలా చేసుకుంటాయో ఒక అవగాహన అందిస్తోంది.

ఇటీవల ఓ ఒరంగుటాన్ ఒక ఔషధ గుణాలున్న మొక్కను ఉపయోగించి తన గాయాన్ని నయం చేసుకునే దృశ్యం శాస్త్రవేత్తల కంటపడింది.

శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఇలా ఒక జంతువు వైద్యం చేసుకోవడం చూశారు.కోతి జాతి అయిన ఒరంగుటాన్ మానవులతో దగ్గరగా తెలివిని కలిగి ఉంటుంది.

దానిని అడవి మనిషిగా పిలుస్తుంటారు. """/" / ఈ సంఘటన గున్‌గ్ లెయూసెర్ నేషనల్ పార్క్‌( Gunung Leuser National Park )లోని సువాక్ బాలింబింగ్ అనే పరిశోధనా ప్రాంతంలో జరిగింది.

30 ఏళ్ల వయస్సు గల ఒక మగ ఒరంగుటాన్ ఈ మొక్కను ఉపయోగించింది.

రాకుస్( Rakus ) అనే పేరు గల ఈ పెద్ద కోతి మానవులు ఔషధాలను ఉపయోగించే విధానానికి సమానంగా అకర్ కునింగ్ మొక్కను వాడింది.

ఒరంగుటాన్లు సాధారణంగా ఈ మొక్కను తినవు, కానీ రాకుస్ భిన్నంగా ఆలోచించింది.అది ఆకులను రసం కోసం మెత్తగా నమిలింది, ఆ తరువాత దానిని తన ముఖంపై గాయానికి పూసుకుంది.

రసం రాసుకున్న తరువాత, నమిలిన ఆకులను గాయంపై కట్టులా ఉంచింది. """/" / రాకుస్ ప్రవర్తన ఎందుకు ప్రత్యేకమైనది అంటే అకర్ కునింగ్ మొక్క సంప్రదాయ వైద్యంలో వివిధ ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది.

శాస్త్రవేత్తలు రాకుస్ ఈ విషయం తెలుసుకుని, గాయాన్ని నయం చేసుకోవడానికి ఈ మొక్కను ఉపయోగించిందని నమ్ముతున్నారు.

గాయం కేవలం ఐదు రోజుల్లోనే, ఎటువంటి ఇన్ఫెక్షన్ సంకేతాలు లేకుండా త్వరగా నయమవ్వడం చూసి వారు ఆశ్చర్యపోయారు.

ఈ సంఘటన మానవులు, జంతువుల మధ్య ఆసక్తికరమైన పోలికలను వెల్లడిస్తుంది.జంతువులు కూడా స్వీయ-చికిత్స చేసుకోవడానికి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొక్కల ఔషధ గుణాలను ఉపయోగించగలవని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.

రాకుస్ ప్రవర్తన మనకు ప్రకృతిలోని మొక్కల ఔషధ గుణాల గురించి మరింత తెలుసుకోవడానికి, మానవ ఆరోగ్యానికి వాటిని ఉపయోగించే కొత్త మార్గాలను కనుగొనడానికి సహాయపడుతుంది.

వైరల్: ఇటువంటి సాహసం మీ వల్ల కానేకాదు సుమీ!