చుండ్రుని నివారించే నారింజ తొక్క‌లు..ఎలాగంటే?

చుండ్రు.ఒక్క‌సారి ప‌ట్టుకుందంటే అంత త్వ‌ర‌గా వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌దు.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, త‌ల‌లో ఉండే అధిక జిడ్డు, త‌ల స్నానం విషయంలో చేసే పొర‌పాట్లు, ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూలు వాడ‌టం.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చుండ్రు ఏర్ప‌డుతుంది.దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే ఈజీగా చుండ్రును స‌మ‌స్య‌కు బై బై చెప్ప‌వ‌చ్చు.

మ‌రి చిట్కాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.నారింజ పండు తొక్క‌లు త‌ల‌లోని చుండ్రును తొల‌గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కొన్ని నారింజ పండ్ల‌ తొక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల నారింజ తొక్క‌ల పేస్ట్‌, రెండు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్‌ వేపాకు పొడి, కొద్దిగా వాట‌ర్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల మొత్తానికి ప‌ట్టించి.గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక చుండ్రు స‌మ‌స్యే ఉండ‌దు.

"""/" / ఫిష్ ఆయిల్ కూడా చుండ్రును నివారించ‌డంలో గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.ఫిష్ ఆయిల్‌ను డైరెక్ట్‌గా త‌ల‌కు అప్లై చేసి ప‌ది నుంచి ప‌ది హేను నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

గంట అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ ఉండే షాంపూను యూజ్ చేసి హెడ్ బాత్ చేయాలి.

ఇలా నాలుగు రోజుల‌కు ఒక సారి చేస్తే చుండ్రు పోతుంది.అదే స‌మ‌యంలో ఫిష్ ఆయిల్‌లో ఉండే ప‌లు పోష‌క విలువ‌లు హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్ వంటి స‌మ‌స్య‌ల‌కు అడ్డు క‌ట్ట వేస్తాయి.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి: దిల్ రాజు