మొటిమలపై ఆరెంజ్ తో అస్త్రం సంధించండి
TeluguStop.com
ఆరెంజ్ ఎన్నో లాభాలని మోసుకొచ్చే ఫలం.చెప్పాలంటే, సిట్రస్ జాతి గర్వించే ఫలం ఇది.
విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్స్ లాంటి ఖజానా కలిగిన ఆరెంజ్, ఎన్నోరకాలుగా శరీరానికి సేవ చేస్తుంది.
ఈరోజు, ఆరెంజ్ మొటిమలపై ఎలా పనిచేస్తుందో చూద్దాం.* ఫ్రెష్ ఆరెంజ్ పీల్ ముఖంపై రాయడం ద్వారా, ఆరెంజ్ ని పేస్ట్ లా తాయారుచేసుకోని అప్లై చేయడం ద్వారా, ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా, ఆరెంజ్ తినటం ద్వారా మొటిమలతో పోరాడవచ్చు.
* ఆయిల్ స్కిన్ ఉన్నవారు మొటిమలతో ఎక్కువగా బాధపడుతుంటారు.ఆరెంజ్ లో ఉండే నొనిలెటిన్ అనే ఫ్లెవనాయిడ్ సెబమ్ ప్రొడక్షన్, అంటే ఆయిల్ సీక్రేషన్ ని తగ్గిస్తుంది.
దాంతో మొటిమలు తగ్గుముఖం పడతాయి.* మొటిమలు పెరగటానికి కారణం బ్యాక్టీరియా.
అందులోనూ ప్రోపియోని బ్యాక్టీరియమ్ అనే బ్యాక్టీరియా మొటిమలను పెంచి పోషిస్తుంది.ఆరెంజ్ ఈ బ్యాక్టీరియాతో పోరాడి చర్మాన్ని కాపాడుతుంది.
* ఆక్నేతో బోనస్ గా వచ్చే సమస్య ఇంఫ్లేమేషన్.దీనికి కూడా ప్రోపియోనిబ్యాక్టీరియమ్ ప్రధాన కారణం.
ఆరెంజ్ దీనిపై ఓ అస్త్రంలా పనిచేస్తుంది.* ఆరెంజ్ ముఖం రంగుని కూడా మారుస్తాయి.
దీన్ని టోనర్ గా పిలుస్తారు అందుకే.ఆరెంజ్ రోజు తినాలే కాని రంగు తేలడం ఖాయం.
మోక్షజ్ఞ ప్రశాంత్ మూవీ రద్దు… సంచలనమైన లేఖ విడుదల చేసిన మేకర్స్!