సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత.. లోకేశ్ కు అవమానం..!!

ఏపీలోని టీడీపీలో ముసలం మొదలయ్యిందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి.ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ జైలుకు వెళ్లినప్పటి నుంచి పార్టీ నేతల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తుందని తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ), బెయిల్ వ్యవహారంతో పాటు లోకేశ్ తీరుపై బయటకు చెప్పలేకపోయినప్పటికీ కొందరు ముఖ్య నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

"""/" / మరోవైపు టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘యువగళం ’ పాదయాత్ర( Yuvagalam ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆపేసిన లోకేశ్ ఇటీవలే మళ్లీ తిరిగి ప్రారంభించారు.

ఈ క్రమంలోనే లోకేశ్ తీవ్ర అవమానం ఎదుర్కొన్నారని తెలుస్తోంది.ఇందుకు కారణం తమ సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడే కావడం గమనార్హం.

"""/" / నారా లోకేశ్ పాదయాత్రను అయ్యన్నపాత్రుడు( Ayyanna Patrudu ) తన నియోజకవర్గంలో నిర్వహించొద్దని చెప్పారని తెలుస్తోంది.

లోకేశ్ యువగళం పాదయాత్ర తన నియోజకవర్గంలో చేస్తే తనకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారట.

అంతేకాకుండా డబ్బు ఖర్చు కావడం తప్ప మరే ఇతర లాభం లేదని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారని ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

సొంత పార్టీ నేతలే ఈ విధంగా వ్యవహరించడం చూసి ప్రజలు పలు విమర్శలు చేస్తున్నారు.

పార్టీ నేతలకే నాయకులపై నమ్మకం లేకపోగా వ్యతిరేక భావన కలిగినప్పుడు ప్రజలు ఏ విధంగా నమ్ముతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో టీడీపీని ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ, వైసీపీ పాలనల్లో ఏ ప్రభుత్వం మంచి చేసిందోనన్నది వారికి తెలుసని.ఈ నేపథ్యంలో ఎవరిని గెలిపిస్తే తమకు మంచి జరుగుతుందో వారికి తెలుసని ప్రజలు అంటున్నారని సమాచారం.

దీన్ని బట్టి ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేడు కాంగ్రెస్ లో చేరిపోతున్న కేకే