హైదరాబాద్‌లో హోంగార్డుల ఆందోళనకు విపక్షాల మద్ధతు
TeluguStop.com
హైదరాబాద్ లో హోంగార్డులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ప్రతిపక్షాలు మద్ధతు తెలుపుతున్నాయి.ఆత్మహత్యకు ప్రయత్నించి డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరామర్శించారు.
ఈ క్రమంలోనే రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై కిషన్ రెడ్డి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విధులు బహిష్కరించి నిరసనకు దిగిన హోంగార్డులకు మద్ధతు తెలిపారు.హోంగార్డుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డ కిషన్ రెడ్డి వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఇప్పటికైనా హోంగార్డులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..