జర్నలిస్టులను వదలని ప్రతిపక్ష సోషల్ మీడియా.. దారుణంగా ట్రోల్స్ చేస్తూ..!!

ఏపీలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అధికార పార్టీ వైసీపీ( YCP )తో పాటు ఆ పార్టీ నేతలపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని తెలుస్తోంది.

టీడీపీ, జనసేన పార్టీ నేతలతో పాటు వాటి అనుకూల సోషల్ మీడియా ఇష్టానుసారంగా పోస్టులను పెడుతుంది.

ఈ క్రమంలోనే ఓ మహిళా జర్నలిస్టును సైతం కించపరుస్తూ దిగజారి ప్రవర్తించారని రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారని తెలుస్తోంది.

ప్రముఖ ఛానల్ కు చెందిన మహిళా జర్నలిస్ట్ పై దారుణంగా ట్రోల్సింగ్స్ చేయడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

"""/" / సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుడివాడ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానితో ప్రముఖ ఛానల్ ప్రత్యేక ప్రొగ్రాం నిర్వహించింది.

ఇందులో భాగంగా సీనియర్ కరస్పాండెంట్ తన విధి నిర్వహణలో భాగంగా కొడాలి నాని బైకుపై కొద్ది దూరం ప్రయాణించారు.

ఆ ఒక్క సందర్భాన్ని అవకాశంగా తీసుకుని సోషల్ మీడియా వేదికగా ఆమెపై విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు.

డ్యూటీలో భాగంగా ఆమె చేసిన ప్రొగ్రాం అనే విషయాన్ని పట్టించుకోకుండా .మహిళా జర్నలిస్టు అనే విచక్షణ లేకుండా ఆమెపై అసభ్యకరమైన, దారుణమైన పోస్టులు పెట్టారు.

"""/" / ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా ఎంత నీచానికి పాల్పడుతుందని అంటూ అక్కడి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుస్తోంది.

రాజకీయ నేత అయినా మరో వ్యక్తి అయినా డ్యూటీలో భాగంగా మహిళా జర్నలిస్టు బైకుపై ఎక్కితే ఇంత నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు ధ్వజమెత్తుతున్నారు.

మామూలుగా టీవీ ఛానళ్లలో ఇలాంటి కార్యక్రమాలు కొత్తేం కాదన్న సంగతి తెలిసిందే.జర్నలిస్టు ఎవరైనా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరితో సందర్భాన్ని బట్టి పని చేస్తూ ఉంటారన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

అన్ని తెలిసి కూడా ఈ విధంగా దారుణంగా, నీచంగా ట్రోలింగ్ దిగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రొగ్రామ్‌లో భాగంగా అలా చేస్తే దాన్ని కూడా వక్రీకరించి.ఆమెను మానసికంగా దెబ్బతీసేయాలని ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

జర్నలిజంలో మహిళల సంఖ్య తగ్గుతున్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం విచారకరం.

జర్నలిస్టు హసీనా( Haseena Shaik ) స్థానంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వారి అక్కనో,చెల్లెలో ఉంటే ఈ విధంగానే చేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అందంగా ఉండడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా మారిందా? వీడియో వైరల్