ప్రోటోకాల్ వివాదంలో చిక్కుకున్న ప్రతిపక్ష నేత ఖర్గే..!!
TeluguStop.com
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మరో వివాదంలో చిక్కుకున్నారు.ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆయన హాజరు కాలేదు.
అనారోగ్యం కారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేనంటూ మల్లికార్జున ఖర్గే తెలిపారని తెలుస్తోంది.
దీంతో వేడుకలు జరిగినంత సమయం ఆయనకు కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించింది.అయితే మరోవైపు ఏఐసీసీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో ఖర్గే హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మోదీ తన ఇంట్లో జెండాను ఎగుర వేసుకుంటారని ఎద్దేవా చేశారు.
సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఇండియన్-కెనడియన్ కపుల్.. ఎందుకంటే?