మోడీకి వ్యతిరేకమా.. పోలిటికల్ వ్యూహమా !

2024 ఎన్నికల్లో మోడి సర్కార్( Narendra Modi ) ను గద్దె దించాలని విపక్షాలన్నీ గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యేందుకు గట్టి ప్రయత్నలే జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో మోడి సర్కార్ ను దెబ్బ తీసేందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్ని కూడా విపక్షాలు వదలడం లేదు.

తాజాగా నూతన పార్లమెంట్ విషయంలో మోడీ ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు.ఇప్పుడు మోడీ అధ్యక్షతన జరుగుతున్నా నీతి అయోగ్ కార్యక్రమాన్ని కూడా బహిష్కరించాయి.

దాదాపు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి అయోగ్ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసినట్లు తెలుస్తోంది.

"""/" / విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం ప్రదర్శిస్తోన్న వైఖరికి నిరసనగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.

హాజరుకానీ వారిలో, తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్, పశ్చిమ బెంగాల్ సి‌ఎం మమతా బెనర్జీ,( Mamata Banerjee ) కేరళ సి‌ఎం పినరయి, తమిళనాడు సి‌ఎం స్టాలిన్,పంజాబ్ సి‌ఎం భగవంత్, డిల్లీ సి‌ఎం కేజ్రీవాల్ బిహార్ సి‌ఎం నితీశ్ కుమార్, కర్నాటక సి‌ఎం సిద్దిరామయ్య వంటి వారు ఉన్నారు.

అయితే వీరంతా కూడా మొదటి నుంచి మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నా వారే.

"""/" / కాగా వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రణాళికలో ఉన్నారు.

అందువల్ల వీరంతా నీతి అయోగ్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని బీజేపీ ( BJP )నేతలు భావిస్తున్నారు.

అయితే వీరంతా హాజరు కాకపోవడం వెనుక పోలిటికల్ వ్యూహం ఉందనేది కొందరి విశ్లేషకుల భావన.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అనుకూల పార్టీలు ఏవి ? ప్రతికూల పార్టీలు ఏవి అనే దానిపై నీతి అయోగ్ కార్యక్రమానికి హాజరైనా వారిని, హాజరుకానీ వారిని బట్టి ఓ అంచనాకు రావొచ్చనే ఆలోచన విపక్షాలలో ఉండే అవకాశం ఉంది.

అందుకే వ్యూహాత్మకంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి అయోగ్( NITI Aayog ) కార్యక్రమాన్ని బాయ్ కట్ చేసినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

రూ.100లోపే ఇల్లు కొనేసింది.. ఇప్పుడు ఆ ఇంటి లుక్కు చూస్తే ఆశ్చర్యపోతారు..