Operation Valentine : వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ సెన్సార్ రివ్యూ.. వరుణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరిందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) నటించిన లేటెస్ట్ ఎయిర్‌ఫోర్స్ బ్యాగ్‌డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine )శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటించగా రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ను అందించారు.అయితే వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ, అప్పుడు సాధ్యం కాకపోవడంతో మార్చి 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

"""/" / ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది.

ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలనూ పూర్తి చేసింది.అదిరిపోయే స్టోరీతో డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణ అనంతర కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది.

ఇలా ఇటీవలే ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది.అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

</br """/" / వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్( Shakti Pratap Singh ) హడా రూపొందించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా తెలిశాయి.

ఈ మూవీ 2 గంటల 4 నిమిషాల పాటు ఉండబోతుందని తెలిసింది.అంటే సాధారణంగా వచ్చే సినిమాల కంటే చాలా తక్కువ రన్ టైంతోనే వరుణ్ తేజ్ చిత్రం వస్తుందని చెప్పాలి.

సెన్సార్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఫిదా అయ్యారని తాజాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది.

ముఖ్యంగా ఇందులో ఎయిర్‌ స్ట్రయిక్( Air Strike ) సన్నివేశాలు గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంటాయట.

అలాగే క్లైమాక్స్‌ అదిరిపోయేలా ఉందని చెప్పారని టాక్.మొత్తంగా ఈ చిత్రం దేశ భక్తిని రగిల్చేలా ఉంటుందట.

అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్ లో ప్రకారం చూస్తుంటే ఈ సినిమాతో వరుణ్ తేజ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అని తెలుస్తోంది.

Platinum Review: What Kiwi Players Should Know About Reputation, Games And Bonuses