అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20 మంది పిల్లలను రెస్క్యూ చేసి కాపాడి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా వారు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది.

18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 07 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్ శాఖ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలో జిల్లా వ్యాప్తంగా 20 పిల్లలని గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని,18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 07 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు.

తరుచు బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

వీధి బాలలను చూసినప్పుడు, డయల్ 100 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు.

ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

స్టార్ హీరోయిన్ నయనతారకు మరో షాకిచ్చిన ధనుష్.. ఈ వార్నింగ్ తో వెనక్కు తగ్గుతారా?