అంతర్జాతీయ ప్రయాణీకులపై అమెరికా ఆంక్షల ఎత్తివేత: బిజినెస్‌పై భారతీయ ట్రావెల్ కంపెనీల ఆశలు

కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన రంగం పర్యాటక రంగం.ఫస్ట్‌వేవ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుని పలు దేశాలు టూరిస్ట్‌లకు స్వాగతం పలికాయి.

కానీ సెకండ్ వేవ్ వాటికి బ్రేక్ వేసింది.భారత్‌తో సహా పలు దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను దాదాపు అన్ని దేశాలు నిలిపివేశాయి.

తాజాగా మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు దేశాలు పర్యాటక రంగానికి ఊతమివ్వాలని భావిస్తున్నాయి.

ఇక పర్యాటక రంగం తర్వాత కరోనా మొదలైన నాటినుంచీ విమానయానం కూడా సంక్షోభంలో కూరుకుపోయింది.

ఈ క్రమంలో.నష్టాన్ని భరించలేక చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించాయి.

కొన్ని నెలలుగా చాలా దేశాల్లో కరోనా అదుపులోకి రావడంతో విమాన సర్వీసులు మళ్ళీ ప్రారంభమయ్యాయి.

దీంతో.విమానయాన రంగం కోలుకుంటుందని అంతా భావించారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పలు దేశాలు విమాన రాకపోకలను నిషేధించాయి.

ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన విమానయాన రంగానికి ఇది తీరని దెబ్బేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

భారత్ విషయానికి వస్తే.సెకండ్ వేవ్ నేపథ్యంలో మనదేశం నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

పలు దేశాలు భారత్ నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించాయి.దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం పలు దేశాలకు వెళ్లాల్సిన భారతీయులు స్వదేశంలోనే నిలిచిపోయారు.

తాజాగా వాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని వైట్‌హౌస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎఫ్‌డీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన టీకాలను వేసుకున్న వారిని అనుమతించనున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

"""/"/ ఈ నిర్ణయం ట్రావెల్ కంపెనీలకు ఖచ్చితంగా శుభవార్త లాంటిదే.దీని వల్ల అమెరికాకు గతంలో మాదిరిగానే రద్దీ పెరుగుతుందని ట్రావెల్ ఏజెంట్లు భావిస్తున్నారు.

దీర్ఘకాలిక పర్యాటకులు, బిజినెస్, వ్యాపార వీసాలు కలిగి వున్న వారికి అమెరికా ప్రభుత్వ నిర్ణయం మేలు కలిగిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

ఎయిరిండియా, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లు కొత్తగా సర్వీసులను ప్రారంభించడమో లేదంటే అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తాయని ట్రావెల్ కంపెనీలు భావిస్తున్నాయి.

అయితే నిషేధం ఎత్తివేసిన ప్రారంభ రోజుల్లో ఛార్జీలు కాస్త ఎక్కువగా వుండే అవకాశం వుందని తర్వాత నెమ్మదిగా అవి తగ్గుతాయని యాత్రా.

కామ్ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. """/"/ సాధారణంగా నవంబర్- డిసెంబర్ మధ్యకాలంలో భారత్- అమెరికాల మధ్య పీక్ డిమాండ్ వుంటుంది.

కోవిడ్ ఆంక్షల కారణంగా ఇరు దేశాల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకున్న వారు .

తాజాగా అమెరికా నిర్ణయంతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ముంబై, ఢిల్లీల నుంచి ఎయిరిండియా నాన్‌స్టాప్ విమానాలను నడుపుతోంది.అలాగే నవంబర్ 3 నుంచి ఎయిరిండియా ఢిల్లీ-చికాగో మార్గంలో వారానికి ఆరు నుంచి ఏడు వరకు సర్వీసులను పెంచనుంది.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 31 వరకు న్యూయార్క్- ఢిల్లీ మధ్య సర్వీసులను నడపనుంది.

ఇకపోతే జనవరి 4 నుంచి సీటెల్-బెంగళూరు మధ్య ఈ సంస్థ కొత్త సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది.

Siddharth Aditi Rao Hydari : సిద్దార్థ్ అదితిరావు హైదరీ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!