హైదరాబాద్ కోకాపేట్‎లో అల్లు స్టూడియోస్ ప్రారంభం

హైదరాబాద్ కోకాపేట్‎లో అల్లు స్టూడియోస్ ప్రారంభం అయింది.లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.

ప్రస్తుతం ఒక ఫ్లోర్ అందుబాటులోకి రాగా.మరో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది.

ఇక స్టూడియోలో ఈనెల 4 నుంచి అల్లు అర్జున్ నటించనున్న పుష్ఫ-2 సినిమా షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సినిమా షూటింగ్ లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని సౌకర్యాలతో సుమారు 10 ఎకరాల స్థలంలో అల్లు స్టూడియోస్ విలాసవంతంగా నిర్మితమైంది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడం వల్ల స్టూడియో అందరికీ అందుబాటులో ఉంటుంది.

అల్లు అర్జున్ ను లైన్ లో పెట్టిన ప్రశాంత్ వర్మ… విజువల్ వండర్ గా రాబోతుందా..?