ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఓపెన్ ఏఐకి( Open AI ) చెందిన 26 ఏళ్ల భారత సంతతికి చెందిన మాజీ ఉద్యోగి శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆత్మహత్యకు చేసుకోవడం అమెరికాలో దుమారం రేపుతోంది.

మృతుడిని సుచిర్ బాలాజీగా( Suchir Balaji ) గుర్తించారు.ఆలస్యంగా వెలుచూసిన ఈ ఘటన నవంబర్ 26న చోటు చేసుకున్నట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని( San Francisco ) బుకానన్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో సుచిర్ బాలాజీ చనిపోయినట్లుగా నగర పోలీసులు, చీఫ్ మెడికల్ ఎగ్జామినర్‌ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ది మెర్క్యూరీ న్యూస్ పేర్కొంది.

"""/" / మరణించిన విధానాన్ని బట్టి సుచిర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లుగా ది మెర్య్కూరి నివేదించింది.

అయితే ఓపెన్ ఏఐ వ్యాపారాలకు సంబంధించి సంచలన వాస్తవాలను బాలాజీ బయటికి తీసుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డబ్బు సంపాదించానికి ఓ వేదికగా మారిన చాట్‌జీపీటీ( ChatGPT ) అనే జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌ను అభివృద్ది చేయడానికి ఓపెన్ఏఐ.

యూఎస్ కాపీరైట్ యాక్ట్‌ను( US Copyright Act ) ఉల్లంఘిస్తోందని బాలాజీ ఆరోపించారు.

ఇలా ఆరోపించిన మూడు నెలలకే సుచిర్ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం కలకలం రేపుతోంది.

"""/" / 2022 చివరిలో ఓపెన్ఏఐపై రచయితలు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, జర్నలిస్టుల నుంచి పలు వ్యాజ్యాలను ఎదుర్కొంది.

కంపెనీ తన ప్రోగ్రామ్‌కు శిక్షణ ఇవ్వడానికి, దాని విలువను 150 బిలియన్ల డాలర్ల మేర పెంచడానికి చట్ట విరుద్ధంగా తమ కాపీ రైట్ మెటీరియల్‌ను దొంగిలించిందని వారు ఆరోపించారు.

అక్టోబర్ 23న ప్రచురించబడిన , న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచిర్ బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఛాట్‌జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి డేటాను అందజేసిన వ్యాపారవేత్తలకు ఓపెన్ఏఐ హాని చేస్తుందన్నారు.ఇకపై సాంకేతికత విషయంలో ఎవరూ సహకరించొద్దన్న ఆయన ఇది సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగిస్తుందని హెచ్చరించారు.

మరోవైపు .బాలాజీ తల్లి తన కుమారుడి విషయంలో గోప్యత పాటించాల్సిందిగా పోలీసులను అభ్యర్ధించినట్లు మెర్క్యూరీ న్యూస్ నివేదించింది.

రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..