ఆ రైలులో అంద‌రికీ ఉచిత ప్ర‌యాణమే.. ఎక్క‌డ ఎక్కాలంటే..

భారతీయ రైల్వే.ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్.

ఇంత‌టి భారీ వ్య‌వ‌స్థ క‌లిగిన రైల్వేశాఖ దేశంలో ఒక ఉచిత రైలును న‌డిపిస్తోంది.

ఈ ప్రత్యేక రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దులో నడుస్తుంది.మీరు భాక్రా నాగల్ డ్యామ్ చూడటానికి వెళితే, ఈ రైలు ప్రయాణాన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు.

ఈ రైలు నాగల్ నుండి భాక్రా డ్యామ్ వరకు నడుస్తుంది.గత 73 ఏళ్లుగా 25 గ్రామాల ప్రజలు ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

భాగ్రా డ్యామ్ గురించి అంద‌రికీ తెలియ‌జేయ‌డానికే ఈ ఉచిత రైలును న‌డుపుతున్నారు.భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఈ రైలును నిర్వహిస్తుంది.

ఈ రైలు డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది.ఈ రైలు నంగల్ నుండి ఉదయం 7:05 గంటలకు బ‌య‌లుదేరుతుంది.

సుమారు 8:20 గంటలకు ఈ రైలు భక్రా నుండి నంగల్‌కు తిరిగి వస్తుంది.

నంగల్ నుండి భాక్రా డ్యామ్ చేరుకోవడానికి రైలు దాదాపు 40 నిమిషాలు పడుతుంది.

రైలును ప్రారంభించినప్పుడు అందులో 10 కోచ్‌లు నడిచేవి, ప్రస్తుతం 3 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి.

ఈ రైలులో ఒక కోచ్‌ను పర్యాటకులకు, మరొకటి మహిళలకు కేటాయించారు.ఈ రైలులోని అన్ని కోచ్‌లు చెక్కతో తయారు చేశారు.

Chandrababu : ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీల పొత్తు..: చంద్రబాబు