రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మనుగడకు కాలమే సమాధానం..కొడాలి నాని

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై దీక్షలు చేస్తున్నవారు,ఎన్టీఆర్ పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైన వారిని ముందు తరిమికొట్టాలని, అప్పుడు తమ గురించి మాట్లాడాలని మాజీ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

రాష్ట్ర రాజకీయాలపై కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పెద్ద స్టార్ అయిన పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతు అవసరం రాకపోవచ్చని, 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు మద్దతు ఉంటే ఆయనకు చాలని కొడాలి నాని అన్నారు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మనుగడకు కాలమే సమాధానం చెప్పాలని , రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారేమో నని ఆయన అభిప్రాయపడ్డారు.

2వందల ఏళ్ళు అయినా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కాదని, అమాయకులైన అమరావతి రైతుల ముసుగులో, కమ్మ కుల ఉగ్రవాదులు చేస్తున్నదే పాదయాత్ర యాత్రని కొడాలి నాని చెప్పారు.

నన్ను కుల బహిష్కరణ చేయడానికే ఓడిపోయిన పదిమంది కమ్మ టిడిపి నాయకులు, గుడివాడ వచ్చి తొడలు కొట్టారని , రైతులెవరు చంద్రబాబు ట్రాష్ లో పడవద్దని కొడాలి నాని హితవు పలికారు.

వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సినిమాలు చేయడం లో ఎందుకు లేట్ చేస్తున్నారు…