ప్రతిరోజు శబరిమలలో ఇంత మందికే అనుమతి.. దర్శనం వేళలలో కూడా మార్పులు..

కేరళలోని శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.సోమవారం ఒక్కరోజే దాదాపు రికార్డు స్థాయిలో 1,10,000 మంది భక్తులు దర్శనం కోసం బుక్ చేసుకున్నారు అంటే పరిస్థితి ఎలాగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.

ఈసారి ఇదే అత్యధిక బుకింగ్ కావడం కూడా విశేషం.లక్ష మార్కును దాటడం ఇది రెండోసారి.

ఇంకా చెప్పాలంటే శనివారం ఒక్కరోజే లక్ష మందికి పైగా బుకింగ్ చేసుకోగా 90,000 మంది దేవాలయాన్ని దర్శించినట్లు దేవాలయ అధికారులు చెబుతున్నారు.

ఇలా రోజురోజుకీ విపరీతమైన రద్దీని నియంత్రించే క్రమంలో కొందరు భక్తులతో పాటు పోలీస్ సిబ్బందికి కూడా గాయాలు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

శబరిమల లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నందుకు సోమవారం రోజు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

శబరిమల లోని అయ్యప్ప పుణ్యక్షేత్రానికి తీర్థయాత్ర కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజుకి పెరుగుతూ ఉండడం వల్ల కేరళ ప్రభుత్వం సోమవారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

అది ఏమిటంటే ప్రతిరోజు 90,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

అయితే దర్శనం సమయాన్ని గంట పాటు పొడిగించినట్లు సమాచారం.కేరళ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు.

"""/"/ కేరళ రాష్ట్రంలోని పతనం తిట్ట జిల్లాలోని శబరిమల వద్ద ప్రతిరోజు 90000 మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేలా సమావేశంలో నిర్ణయించినట్లు ట్రావెల్ కోర్ దేవా స్వామి బోర్డు చైర్మన్ అనంత గోపాల్ తెలిపారు.

కేరళ హైకోర్టు సూచన మేరకు దర్శనం వేళలు సైతం పెంచినట్లు సమాచారం.రోజు ఉదయం దర్శన సమయాలను తెల్లవారుజామున మూడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషముల వరకు పొడిగించారు.

మళ్ళీ మధ్యాహ్నం సమయంలో మూడు గంటల నుంచి రాత్రి 11:30 వరకు భక్తుల దర్శనానికి అనుమతించాలని సమావేశంలో నిర్ణయించినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.

అయితే నవంబర్ 17న ప్రారంభమైన 41 రోజుల మండల పూజా ఉత్సవాలు డిసెంబర్ 27న ముగిసే అవకాశం ఉంది.

పుణ్యక్షేత్రం జనవరి 22,2023న మూసి వేయడం జరుగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని బలి చేశారు.. రోజా షాకింగ్ కామెంట్స్!