సాక్షాత్తు శివుడు ప్రతిష్టించిన శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?
TeluguStop.com
మన హిందూ పురాణాల ప్రకారం మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి.ఈ శివాలయాలలో ఉన్న శివ లింగాలు అన్ని సాక్షాత్తు దేవ దేవతలు, మునులు ప్రతిష్టించిన విగ్రహాలుగా చెప్పబడతాయి.
అదే విధంగా మరికొన్ని శివలింగాలు స్వయంభూగా వెలిసిన శివలింగాలుగా ప్రసిద్ధి చెందాయి.అయితే సాక్షాత్తు ఆ పరమశివుడే శివలింగాన్ని ప్రతిష్టించడం ఎప్పుడైనా విన్నారా.
పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం ఎక్కడ ఉంది? ఆ లింగం ప్రత్యేకత ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, కుంభకోణానికి దగ్గరలో తిరువిడైమరుదూర్ అనే శివాలయం ఉంది.ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.
పురాణాల ప్రకారం సృష్టి మొదలైనప్పుడు భక్తులు పూజించుకోడానికి పరమశివుడు ఈ శివలింగాన్ని సృష్టించి ఆ శివలింగానికి శక్తిని ప్రసాదించడానికి తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈవిధంగా పరమశివుడు తన తపోశక్తిని శివలింగంలో ప్రవేశ పెట్టడం వల్ల ఈ శివలింగాన్ని మహా శివలింగం అని పిలుస్తారు.
ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఎంతో అరుదుగా కనిపించే తెల్లటి మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి.
"""/" /
అదే విధంగా ఈ ఆలయం చుట్టూ నాలుగు శివాలయాలు ఉండి మధ్యలో తిరువిడైమరుదూర్ అనే శివాలయం ఉండటం వల్ల దీనిని పంచలింగ స్థలమని కూడా పిలుస్తారు.
ఎంతో మహిమ కలిగిన ఈ శివాలయంలో ఉన్న స్వామి వారిని దర్శించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా దీర్ఘకాలిక సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు తొలగిపోతాయని స్థానికుల ప్రగాఢ నమ్మకం.
వైరల్ వీడియో.. ఇంత ఘోరంగా ఉంరేంట్రా.. పునరావాస కేంద్రంలో రోగిపై దాడి!