షారుఖ్ ఖాన్ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే..టాలీవుడ్ హీరోలు అందుకోలేని రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్
TeluguStop.com
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, ఆయన గురించి అందరికీ తెలిసిందే.
ఇతర హీరోలకు కలలో కూడా సాధ్యపడని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం.
మిగిలిన హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో సినిమాలు సెట్ చేసుకొని భారీ ఓపెనింగ్స్ మరియు మార్కెట్ ని తెచ్చుకుంటుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఊరు పేరు తెలియని డైరెక్టర్స్ తో సినిమాలు చేసి ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఉంటాడు.
రన్ రాజా రన్( Run Raja Run Movie ) మరియు 'సాహూ' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ ( Sujeeth )ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
సుజిత్ తీసిన ఈ రెండు సినిమాలో 'రన్ రాజా రన్' అనే చిత్రం ఒక్కటే సూపర్ హిట్ గా నిల్చింది.
సాహూ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యిందనే సంగతి మన అందరికీ తెలిసిందే. """/" /
అయితే పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత రీమేక్ కాకుండా, ఒక స్ట్రెయిట్ సబ్జెక్టు తో పాన్ ఇండియా సినిమా చెయ్యడం, దానికి తోడు ఇండియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న యాక్షన్ జానర్ లో ఆయన నటించడం తో ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.
ఇందులో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ మరియు ఆయన లుక్ ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేసే రేంజ్ లో ఉంటుందట.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ పవన్ కళ్యాణ్ కి వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్( 100cr Remuniration ) ని నిర్మాత డీవీవీ దానయ్య ఇస్తున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యలేదు.ఆయన చేసినవి కేవలం ప్రాంతీయ బాషా చిత్రాలు మాత్రమే.
అలాంటిది పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
"""/" /
బాలీవుడ్ హీరోలకు కేవలం హిందీ లో తప్ప మరో భాషలో మార్కెట్ లేదు,అందుకే ఆ హీరోలకు అక్కడి మార్కెట్ ని బట్టి రెమ్యూనరేషన్స్ ఇస్తుంటారు నిర్మాతలు.
సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ మాత్రమే వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఇప్పుడు వాళ్ళ తర్వాత కేవలం తెలుగు మార్కెట్ తో వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఏకైక హీరో గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు.
ఆయనతో పాటుగా అల్లు అర్జున్ , రామ్ చరణ్ మరియు ప్రభాస్ కూడా వంద కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ని తీసుకునే హీరోల జాబితాలో ఉన్నారు.
తమిళ హీరోలైన రజినీకాంత్ మరియు విజయ్ లు కూడా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
కానీ వీళ్ళందరికీ పాన్ ఇండియా మార్కెట్ ఉంది, పవన్ కళ్యాణ్ కి కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే ఉంది.
ఇదే వాళ్లకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న తేడా.
వెంకటేష్ అల్లు అర్జున్ ఇద్దరిని పరిచయం చేసింది ఆ స్టార్ డైరెక్టరేనా..?