తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేనేతకు చేయూత:కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా:చేనేతకు చేయూతనందించేది కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని,మిగతా ఎక్కడా లేదని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

భూదాన్ పోచంపల్లిలో శనివారం మంత్రి కేటీఆర్( Minister KTR ) పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు.

ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు సైని భగత్ ఏర్పాటు చేసిన కళా పునర్వి చేనేత యూనిట్ ని కేటీఆర్ ప్రారంభించారు.

చేనేతలను కాపాడడంతో పాటు నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ ని ఏర్పాటు చేసిన భగత్ బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని,మోడీ ప్రభుత్వం అన్నింటిని అమ్మి చేనేతలను ఇబ్బంది పాలు చేస్తుంటే,తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు.

పోచంపల్లి చేనేత పార్క్ ను పునరుద్ధరించి ఇక్కడి నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

తమిళనాడులోని తిరుపూర్ టెక్స్టైల్ క్లస్టర్ మాదిరిగా పోచంపల్లి నేతన్నలు కలిసి పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

అనంతరం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతా రెడ్డి,ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలతో కలసి అవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్,ప్రభాకర్ రెడ్డి, సైదిరెడ్డి,రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,ఎల్.

రమణ,కంచర్ల రామకృష్ణా రెడ్డి,గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?