అమెరికాలో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చప్పట్లు కొట్టిస్తోంది...!!!

మానవత్వం అనేది ఒకరు చెప్తే వచ్చేసేది కాదు మనకి మనకుగా మనసులో కలగాలి.

కళ్ళ ముందు ఘోరం జరుగుతుంటే అయ్యో పాపం అనుకునేదానికన్నా, వెంటనే స్పందించడం అసలైన మానవత్వం.

అమెరికా పేరు చెప్తేనే మనకి గుర్తుకు వచ్చేది గన్ కల్చర్, లేదా డ్రగ్స్, లేదా అక్కడ భారతీయులపై జరిగే జాత్యహంకార దాడులు ఇవే అమెరికా సమాజంలో రోజు వారి ఎదో ఒక మూల జరిగే కార్యక్రమాలు.

కానీ అమెరికాలో ఓ ఘటన అందరిని కదిలించింది.ఓ మహిళ దిక్కు తోచని స్థితిలో తన ప్రాణాల కోసం కారు క్రింద ఉండి కొట్టు మిట్టాడుతుంటే ఈ ఘటన చూసిన అమెరికన్స్ చలించిపోయారు.

ఆ మహిళని కాపాడారు.ఈ తతంగం అంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఈ ఘటనా తాలూకు వివరాలలోకి వెళ్తే. """/"/ న్యూయార్క్ లో రోడ్డు పక్కనే నిలబడి ఉన్నవేరోనికా అనే ఓ మహిళా పైకి ఒక్కసారిగా ఓ కారు దూసుకువచ్చింది.

ఈ ఘటనలో ఆమె కిందపడిపోగా కారు టైర్స్ లో ఆమె కాళ్ళు ఇరుక్కుపోయాయి.

ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఇద్దరు వచ్చి ఆమెని తీయడానికి ప్రయత్నించారు.

ఆ తరువాత మరో ఇద్దరు తోడయ్యి కారుని పైకి లేపడానికి ప్రయత్నాలు చేశారు.

వెనువెంటనే మరో ఇద్దరు తోడయ్యారు, ఇలా చాలామంది ఆ కారుని పైకి ఎత్తి ఆమెని బయటకి తీశారు.

ఈ ఘటన అందరూ కలిస్తే సాధించలేనిది లేదు, మంచి పనికి అందరూ తోడూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్సనంగా నిలిచింది.

భారీ ధరలకు చైతన్య తండేల్ డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!