సరికొత్త రికార్డ్ సాధించిన భారత్ పే..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అలవాటు పడిపోయారు.

ఈ క్రమంలో మార్కెట్లోకి రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.వాటితో పాటు మార్చంట్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం అయిన భారత్‌ పే కూడా వినియోగదారులకు బాగానే ఉపయోగపడుతుంది.

అసలు భారత్ పే వలన ఉపయోగం ఏంటంటే.న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించడమే దీని ముఖ్యం ఉద్దేశం.

అందుకనే భారతదేశం ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి ఇంట‌ర్‌ పోర్ట‌బుల్ పేమెంట్ యాక్సెప్టెన్సీ వ్య‌వ‌స్థ ద్వారా భార‌త్‌ క్యూఆర్ కోడ్‌ ను తీసుకొచ్చింది.

అంటే భార‌త్‌ పే ప్ర‌త్యేక‌త‌ ఏంటంటే చెల్లింపుల‌కు ఎటువంటి కార్డు అవ‌స‌రం లేకపోవడం.

ఇప్పుడు భారత్ పే ఒక అరుదైన ఘనతను సాధించింది.ఈ కంపెనీ అత్యంత తక్కువ సమయంలో 370 మిలియన్‌ డాలర్లను సేకరించి యూనికార్న్‌ క్లబ్‌ లోకి చేరడం విశేషం అనే చెప్పాలి.

ఈ నిధులను టైగర్‌ గ్లోబల్‌ సంస్థ నుంచి సేకరించింది.భారత స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ విధానం బట్టి ఈ సంవత్సరం 19 వ యూనికార్న్‌ స్టార్టప్‌ గా భారత్‌ పే కి స్థానం దక్కింది.

"""/"/ అంటే ఒక స్టార్టప్‌ విలువ ఒక బిలియన్‌ డాలర్లకు చేరిన తర్వాత దానిని యూనికార్న్‌ స్టార్టప్‌ గా పిలుస్తారన్నమాట.

అంతేకాకుండా డ్రాగోనీర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌, స్టెడ్‌ ఫాస్ట్‌ క్యాపిటల్‌ కంపెనీలో భారత్‌ పే కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటుచేసింది.

ప్రస్తుతం భారత్‌ పే సంస్థాగత పెట్టుబడిదారుల్లో రిబ్బిట్‌ క్యాపిటల్‌, మేనేజ్మెంట్‌, ఇన్‌ సైట్‌ పార్ట్‌ నర్స్‌, ఆంప్లో, సీక్వోయా గ్రోత్‌ కంపెనీలు ఉన్నాయి.

అలాగే భారత్ పే కంపెనీ కో-ఫౌండర్, సీఈవో అష్నీర్ గ్రోవర్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నుకోగా, సుహైల్ సమీర్‌ ను కంపెనీ కొత్త సీఈవోగా నియమించడం జరిగింది.

ఇక గడిచిన 9 నెలల క్రితం భారత్‌ పే విలువ 900 మిలియన్‌ డాలర్లుగా ఉండేది.

ఇకపోతే ప్రస్తుతం భారత్‌ పే విలువ 2.85 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

టీడీపీ మేనిఫెస్టో పై జగన్ కీలక వ్యాఖ్యలు..!!