కొత్త వ్యాపారం : మీ దగ్గరలో ఉన్న అమ్మాయిలను కలుసుకోవచ్చంటూ…
TeluguStop.com
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఎక్కువ మంది ఇంటి పట్టునే ఉంటున్నారు.
దీంతో కాలక్షేపం కోసం స్మార్ట్ ఫోన్లని బాగానే వినియోగిస్తున్నారు.ఇందులో ఇంతమంది ఆన్లైన్ లో చాటింగ్ చేయడం, వీడియోలు చూడడం వంటి వాటికి బాగా అలవాటు పడ్డారు.
ఈ విషయాన్ని అదునుగా చేసుకున్నటువంటి కొన్ని మొబైల్ యాప్ సంస్థలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.
ఇందులో భాగంగా కొత్త కొత్త యాప్ లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.ఇందులో ఆన్ లైన్ డేటింగ్ అంటూ తమకు నచ్చిన అమ్మాయిని తమ ఏరియాలోనే కలుకోవచ్చని ప్రకటనలు చేస్తూ తమ యాప్ ని ఇన్స్టాల్ చేసుకునేందుకు ప్రేరేపిస్తున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా అందమైన యువతుల ఫోటోలను సేకరించి ఈ ప్రకటనలను క్రియేట్ చేస్తూ యువతను ఆకర్షిస్తున్నారు.
అంతేగాక అందమైన ఆడపిల్లల తో చాటింగ్ చేయాలి లేదా ఫోన్ చేయాలంటే డబ్బులు చెల్లించాలంటూ బాగానే దండుకుంటున్నారు.
దీంతో కొంతమంది యువత ఆన్ లైన్ డేటింగ్ కి బలవుతున్నారు.ఈ విషయం ఇలాగే ఇంకొంత కాలం కొనసాగితే భవిష్యత్తులో యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాక యువతను పెడదోవ పట్టించేటువంటి మొబైల్ అప్లికేషన్లను కూడా ప్రభుత్వం గుర్తించి టిక్ టాక్ మాదిరిగానే బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్1, శుక్రవారం 2024