ఇకపై ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడితే ఫైన్ తో పాటు జైలుకు కూడా..!

ఇంట్లో ఉండి మొబైల్ ఫోన్లో ఆడడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుసా.

లాంటి యాడ్స్ చూసి మోసపోకండి.ఎందుకంటే ఈ బెట్టింగ్ గేమ్స్ ఆడదానికి ముందు బాగానే ఉంటాయి.

అలాగే మొదట్లో డబ్బులు కూడా వస్తాయి.కానీ తర్వాత మెల్ల మెల్లగా మీ డబ్బులు మొత్తం స్వాహా అవుతాయని గుర్తుపెట్టుకోండి.

ఎందుకంటే ఆన్‌లైన్ బెట్టింగ్‌ మొత్తం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాముల ద్వారా జరుగుతుంది.బెట్టింగ్ ఆడేవారు ఓడిపోతారే తప్ప.

సాఫ్ట్‌వేర్ ఏప్పటికి ఓడిపోదు.మొదట్లో కొంచెం డబ్బు గెలిచేలా చేసి, ఆ తర్వాత మనం గేమ్ కు అడిక్ట్ అవుతాము.

అప్పుడు మన దగ్గర ఉన్న మొత్తం డబ్బును లాగేసుకుంటాయి బెట్టింగ్ సాఫ్ట్‌వేర్లు.

ఈ విషయాన్ని బెట్టింగ్ గేమ్స్ ఆడేవారు తెలుసుకోవాలి అంటున్నారు తమిళనాడు పోలీసులు.అయితే ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై నిషేధం విధించింది.

ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది.ఇకపై అక్కడ ఎవరూ వాటిని ఆడకూడదు.

ఆడినా, బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఫైన్, జైలు తప్పవు.అయితే దేశంలోకి కరోనా వైరస్ వచ్చాక చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు.

దానితో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు.ఇదే సరైన సమయం అనుకుని మొబైల్ ద్వారానే మనీ సంపాదించుకోండి, ఇంటి దగ్గరే ఉంటూ డబ్బు సంపాదించుకోండి.

అంటూ చాలా యాడ్లు ఊరించాయి.వాటిని చూసి జనాలు కూడా బాగుంది కదా అని రూ.

100, రూ.200 పెట్టి బెట్టింగ్ సైట్లలో చేరుతున్నారు.

తీరా చేరాక మొదట్లో కాస్త డబ్బు వస్తుంటే ఇంకా ఎక్కువ సంపాదించాలని ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడుతున్నారు.

ఫలితంగా డబ్బు మొత్తం కాళీ అవుతుంది.చాలా మంది అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ కడుతున్నవారు.

సూసైడ్లు చేసుకుంటున్నారు.డబ్బులు లేకపోతే దొంగతనాలు కూడా చేసి మరి ఆడుతున్నారు.

ఒక్కసారిగా ఎక్కువ మొత్తం సంపాదించాలని అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు.ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కంటే తమిళనాడులో బాగా ఎక్కువైంది.

"""/"/ ఆత్మహత్యల కంప్లైంట్లూ ఎక్కువవడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.అడ్డగోలు బెట్టింగ్ సైట్లపై కొరడా విధించింది.

ఇకపై ఆ రాష్ట్రంలో ఎవరైనా సరే, కంప్యూటర్లు, మొబైల్స్ వేటితో బెట్టింగ్ ఆడినా నేరమే.

వారికి రూ.5000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష వేస్తారు.

ఎవరైనా సరే బెట్టింగ్ సైట్ నిర్వహించినా, బెట్టింగ్ కార్యకలాపాలు సాగించినా వారికి రూ.

10,000 ఫైన్, 2 ఏళ్ల జైలు శిక్ష తప్పదు.హ మనం బెట్టింగ్ ఆడితే వాళ్లకు ఎలా తెలుస్తుందిలే అని అనుకోకండి పోలీసులు ఇట్టే పసిగట్టకలరు.

ఎలాగంటే బెట్టింగ్ సైట్లకు ఆన్‌లైన్‌లో జరుగుతున్న మనీ ట్రాన్స్‌ఫర్లపై తమిళనాడు పోలీసులు నిఘా పెడుతున్నారు.

అందువల్ల ఎవరైనా సరే బెట్టింగ్ ఆడితే పోలీసులు ఇట్టే కనిపెట్టగలరు.ఎథికల్ హ్యాకర్లు ఇది 100 శాతం మంచి నిర్ణయం అంటున్నారు.

బెట్టింగ్ వల్ల గెలవడం అన్నది ఒక్క శాతం కూడా వీలు కాదు అని గుర్తుపెట్టుకోవాలి.

అందుకనే బెట్టింగ్ సైట్లకు, బెట్టింగ్ గేములకూ కాస్త దూరంగా ఉండటం మేలు కదా.

డబ్బు కోసం ఆశపడడం మంచిదే.కానీ మరి అత్యాశ పడితే ఉన్న డబ్బు పోయే, దాచుకున్నది పోయే అని గుర్తుపెట్టుకోండి.

2018లో ట్రూడో విమానానికి భారత్ షరతులు పెట్టిందా .. కెనడా మంత్రి ఏమన్నారంటే ..?