ఈఎన్ ఎన్, ట్రైకార్ కోరకు గిరిజనుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు.. చివరి తేది ఎప్పుడంటే.. !

మంచిర్యాల జిల్లాలో గిరిజన అభివృద్ధి ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత గిరిజనులకు 2020-21 నంవత్సరానికి గాను ఆర్థిక సహాయ పథకం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గిరిజన అభివృద్ధి అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలని, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ, రేషన్ కార్డు, ఆధాయ ధృవీకరణ పత్రాలు మొదలైనవి ఈ 2021 వ సంవత్సరంలో పొందినవై ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.

ఇకపోతే గ్రామీణ ప్రాంత లబ్దిదారులు రూ.1,50,000 వరకు ఆదాయం మించరాదని, పట్టణ లబ్ది దారులకు రూ.

2 లక్షల వరకు ఆదాయం మించరాదని వెల్లడించారు.ఇక దరఖాస్తు దారులు నివాస ధృవీకరణ పత్రం, మరియు దరఖాస్తూ దారుని ఫోటోలతో Tsobmms.

Cgg.gov!--in వెబ్ సైట్ ద్వారా మీ సేవలో ఈ నెల 28వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఇతర వివరాల కోరకు మండల అభివృద్ధి అధికారిని సంప్రదించాలని వెల్లడిస్తున్నారు.

షాకింగ్ వీడియో: ఇంటి గేట్ మీద పడి చిన్నారి మృతి..