పంటి నొప్పి.ఏదో ఒక సమయంలో చాలా మంది ఫేస్ చేసే సమస్య ఇది.
పంటి నరం దెబ్బ తిన్నపుడు, దంతాలు పుచ్చిపోయినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు, నోరు శుభ్రంగా ఉండనప్పుడు ఇలా పలు కారణాల వల్ల పంటి నొప్పి ఏర్పడుతుంది.
పంటి నొప్పి చిన్న సమస్యే అయినప్పటికీ.చాలా ఇబ్బందికరంగా మరియు బాధాకరంగా ఉంటుంది.
ఇక ఈ సమస్య వచ్చినప్పుడు దాదాపు అందరూ చేసే పని పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటారు.
కానీ, న్యాచురల్‌గా కూడా పంటి నొప్పిని నివారించుకోవచ్చు.ముఖ్యంగా ఉల్లిరసం పంటి నొప్పింని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ఉల్లిరసం మరియు కొబ్బరి నూనె రెండిటిని సమానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రెండు లేదా మూడు చుక్కలు వేసి.
వదిలేయాలి.ఇలా తరచూ చేయడం వల్ల పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఉల్లిరసంతోనే కాదు.మరిన్ని విధాలుగా కూడా పంటి నొప్పికి సులువుగా చెక్ పెట్టవచ్చు.
"""/" /
రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలు తీసుకుని పేస్ట్ చేసుకుని.
ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న పంటిపై పెట్టుకోవాలి.దాని నుంచి వచ్చే రసం నిమిషాల్లోనే నొప్పి నివారిస్తుంది.
పుదీనా కూడా పంటి నొప్పిని తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.పుదీనాతో తయారు చేసుకున్న టీని తీసుకుంటే.
పంటి నొప్పి నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.అలాగే ఐస్ క్యూబ్స్ కూడా పంటి నొప్పిని నివారించగలవు.
నొప్పి ఉన్న దంతం చెంప మీద ఐస్ క్యూబ్లను రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక ఉప్పు కూడా పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.గోరు వెచ్చని నీటితో ఉప్పు కలిపి.
ఈ నీటితో నోటిని పుక్కలించి శుభ్రం చేసుకుంటే.పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేసవిలో వీటికి నో చెప్పండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!