ఈ సినీ సెలబ్రిటీస్ ఒంగోలియన్స్ అని మీకు తెలుసా..?

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోలో గోపీచంద్, ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత ఒంగోలియన్స్( Ongoleians ) అనే పదం బాగా ఫేమస్ అయ్యింది.

ఒంగోలియన్స్ పదాన్ని సృష్టించింది మన బాలయ్య బాబే.ఇదేదో విదేశీ పదం కాదు.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరంలో పుట్టిన వారినే ఒంగోలియన్స్ అంటారట.సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒంగోలియన్స్ చాలామందే ఉన్నారు.

వారిలో స్టార్ యాక్టర్లు, డైరెక్టర్లు అయిన కొంతమంది గురించి తెలుసుకుందాం.h3 Class=subheader-style• గిరిబాబు/h3p క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు గిరిబాబు.

( Giribabu ) ఆయన కుమారుడు రఘుబాబు కూడా బీభత్సమైన కామెడీ పండిస్తూ అలరిస్తున్నారు.

అయితే వీరిద్దరూ కూడా ఒంగోలియన్సే.రావినూతల గ్రామంలో జన్మించారు.

ఈ ఊరు ఒంగోలు సిటీకు కేవలం 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.వీరు ఒంగోలు సిటీలో పుట్టినా సినిమాలు కోసం మద్రాసుకు వెళ్లిపోయారు.

తర్వాత హైదరాబాద్ వచ్చారు.అది వేరే విషయం.

"""/" / H3 Class=subheader-style• అజయ్ ఘోష్/h3p విచారణ, రంగస్థలం, పుష్ప, గుంటూరు కారం సినిమాలతో ఫుల్ ఫేమస్ అయిన అజయ్ ఘోష్( Ajay Ghosh ) వేటపాలెంలో జన్మించారు.

వేటపాలెం బాపట్ల జిల్లాలో ఓ పట్టణం.ఇది ఒంగోలు రెవెన్యూ డివిజన్‌ కిందకు వస్తుంది.

ఒంగోలు నుంచి వచ్చిన వాళ్లు గొప్ప కళాకారులు అని అజయ్ ఘోష్ నిరూపించారు.

"""/" / H3 Class=subheader-style• హీరో గోపీచంద్/h3p తొలివలపు, యజ్ఞం, ఆంధ్రుడు, వర్షం, జయం, నిజం వంటి సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్.

( Gopichand ) ఈ మాస్ యాక్షన్ హీరో ప్రకాశం జిల్లా, టంగుటూరు సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.

అతను ఒంగోలులోని నిల్ డెస్పరాండమ్‌లో చదువుకున్నాడు. """/" / H3 Class=subheader-style• అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని/h3p అనిల్ రావిపూడి( Anil Ravipudi ) యాక్షన్ కామెడీ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు.

సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, చిత్రం భగవంత్ కేసరి సినిమాలతో ఈ దర్శకుడు భారీ హిట్స్ సాధించాడు.

అయితే ఇతను కూడా ప్రకాశం జిల్లాలోనే జన్మించాడు.గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) డాన్ శీను, బాడీగార్డ్, బలుపు, క్రాక్‌, పండగ చేస్కో సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు.

ఈ దర్శకుడు ఒంగోలు సమీపంలోని బొద్దులూరివారిపాలెం గ్రామంలో పుట్టి పెరిగాడు.

రజినీకాంత్ యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటి..?