రాళ్ళ దాడిపై కొనసాగుతున్న రగడ... కెసీఆర్ స్పందించేనా?

తెలంగాణ రాజకీయాలు వరుస ఘటనలతో హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనకు వెళ్ళిన ఎంపీ ధర్మపురి అరవింద్ పై రాళ్ళ దాడి జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఈ రాళ్ళ దాడి ఘటనపై ఇటు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే.

అయితే ఈ రాళ్ళ దాడి ఘటనపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కెసీఆర్ పై మండి పడ్డారు.

రౌడీయిజం చేయించడానికి ముఖ్యమంత్రి అయ్యావా కెసీఆర్ అంటూ కెసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.

అయితే ఇటు టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం ప్రకారం అందులో టీఆర్ఎస్ నేతలు ఎవరూ లేరని పసుపు బోర్డు గురించి ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీపై మాత్రమే రైతులు ప్రశ్నించారని దానిని రాజకీయాలకు అంటుగట్టడం కాకుండా పసుపు బోర్డు హామీ పై అరవింద్ రైతులకు సమాధానం చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

"""/"/ అయితే ఈ ఘటనపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తున్నా టీఆర్ఎస్ పార్టీ నుండి అంతగా స్పందన రాలేదు.

అయితే ఈ ఘటనకు సంబంధించి కెసీఆర్ స్పందిస్తారా లేరా అనేది రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

అయితే బీజేపీ మాత్రం టీఆర్ఎస్ గుండాగిరిపై ప్రజలు తగిన సమయంలో సమాధానం చెప్తారని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.

మరి టీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు రైతులనే సంకేతం, బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నట్టు టీఆర్ఎస్ నేతలు దాడి చేశారనే విషయం ప్రజల్లోకి వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది.

ఈ రాళ్ళ దాడి ఘటన ఇంకెంత దూరం వెళ్తుందనేది చూడాల్సి ఉంది.

పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే..: మంత్రి జోగి రమేశ్