హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ దాడులు

హైదరాబాద్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.ఎన్నికల బరిలో నిలిచిన టికెట్లు ఆశించిన అభ్యర్థుల నివాసాల్లో దాదాపు నాలుగు గంటలకు పైగా తనిఖీలు జరుగుతున్నాయి.

సుమారు 10 ప్రాంతాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.ఈ మేరకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంటితో పాటు కేఎల్ఆర్ ఫాంహౌస్ లోనూ సోదాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కేఎల్ఆర్ ఇంట్లోకి సెక్యూరిటీ సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదని తెలుస్తోంది.

అలాగే కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటిపైనా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.అయితే ప్రస్తుతం పారిజాత బడంగ్ పేట్ మేయర్ గా ఉన్నారు.

అదేవిధంగ బీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డి నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!