వన్ ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ లాంఛ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇవే..!

వన్ ప్లస్ వాచ్ 2( OnePlus Watch 2 ) కొత్త వేరియంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో లాంచ్ అయింది.

ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ కేవలం యూరోపియన్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలలో అందుబాటులోకి రానుంది.ఈ వాచ్ ధర వివరాలతో పాటు అద్భుతమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

వన్ ప్లస్ వాచ్ 2: ఈ వాచ్ 1.43 అంగుళాల AMOLED డిస్ ప్లే తో వస్తోంది.

466*466 పిక్సెల్ రిజల్యూషన్, 600 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ తో ఉంటుంది.

స్నాప్ డ్రాగన్ WS జెన్ 1, BES2700 డ్యూయల్ చిప్ సెట్ పై పని చేస్తుంది.

గూగుల్ Wear OS 4పై పని చేస్తుంది. """/" / ఈ వాచ్ 500mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి స్మార్ట్ మోడ్ లో 100 గంటల బ్యాటరీ బ్యాకప్ తో ఉంటుంది.

నిరంతరం ఉపయోగిస్తే 48 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.VOO ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం 60 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

కేవలం పది నిమిషాలు చార్జింగ్ చేస్తే ఒక రోజంతా వినియోగించవచ్చు. """/" / ఈ వాచ్ 2GB RAM+32GB స్టోరేజ్ తో ఉంటుంది.

5ATM, IP 68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంది.ఈ వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లతో పాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్ మోడ్ లను( Sports Mode ) కలిగి ఉంది.

ఇప్పటికే ఈ వాచ్ బ్లాక్ స్టీల్, రేడియంట్ స్టీల్ వేరియంట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

తాజాగా ఈ వాచ్ టు కొత్త వేరియంట్ నార్దిక్ బ్లూ ఎడిషన్ లాంచ్ అయింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉండే బ్లాక్ స్టీల్, రేడియంట్ స్టీల్ కలర్ వేరియంట్ ధర రూ.

24999 గా ఉంది.వన్ ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ ధర EUR 349 అంటే మన భారత కరెన్సీలో రూ.

31174.త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది.

గుడ్ న్యూస్ చెప్పబోతున్న నటుడు నాగశౌర్య… తండ్రి కాబోతున్నారా?