ఇండియాలో వన్‌ప్లస్ 11R లాంచ్.. దాని ధర, ఫీచర్లు ఇవే..!

వన్‌ప్లస్ బ్రాండ్ తయారు చేసే ఫోన్లకు ఇండియాలోనే రాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఈ ఫోన్లు అద్భుతమైన ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరలకే దొరుకుతుంటాయి.

కాగా తాజాగా ఇండియాలో ఈ కంపెనీ 'వన్‌ప్లస్ 11R' స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఫాస్ట్ పర్ఫామెన్స్ అందించే ఫోన్ కావాలనుకునే వ్యక్తుల కోసం దీనిని కంపెనీ తీసుకొచ్చింది.

ఇందులో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అందించారు.

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది.ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

5,000mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుంది. """/"/ అంటే ఈ మొబైల్ 25 నిమిషాల సమయంలో ఫుల్ ఛార్జ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ రియర్ కెమెరాల విషయానికొస్తే.ఇందులో మూడు కెమెరా లెన్స్‌లు ఉన్నాయి.

వాటిలో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 8-మెగాపిక్సెల్ వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ లెన్స్ ఉన్నాయి.

ఫోన్ కర్వ్డ్ డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.ఇది 8GB లేదా 16GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో వస్తుంది.

"""/"/ భారతదేశంలో వన్‌ప్లస్ 10R ధర 39,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది.హైయెస్ట్ స్టోరేజ్ వేరియెంట్ మోడల్ రూ.

44,999కి దొరుకుతుంది.ఈ ఫోన్ ఫిబ్రవరి 28న అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఇకపోతే భారతదేశంలో తాజాగా రిలీజ్ అయిన మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 11 5G ధర రూ.

56,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఒత్తిడి, కోపం తగ్గించే విగ్రహం.. థాయ్ ఆర్టిస్ట్‌లు క్రియేటివ్ ఐడియా..