OnePlus 11 ట్రైలర్ చూసారా? దిమ్మతిరిగే ఫీచర్స్ షురూ!

మార్కెట్లో ఎన్ని ఫోన్ల హవా కొనసాగుతున్నప్పటికీ కొన్ని ఫోన్లు చాలా స్పెషల్ అనిపించుకుంటాయి.

అందుకే వినియోగదారులు వాటిని అమితంగా ఇష్టపడతారు.సదరు కంపెనీనుండి కొత్త మోడల్స్ ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ వుంటారు.

అలాంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలలో OnePlus ఒకటి.అవును, OnePlus అంటే కొంతమందికి ఎనలేని ఆసక్తి ఉంటుంది.

అలాంటి అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌.చైనాకు చెందిన ఈ ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీ మరో ప్రీమియం ఫోన్‌ లాంచింగ్‌కు రంగం సిద్ధం చేసుకుంది.

వన్‌ప్లస్‌ నుంచి మరో ప్రొడక్ట్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.ఈ లేటెస్ట్‌ డివైజ్‌ Oneplus 11 వివరాలను ఇటీవల చైనాలో నిర్వహించిన ఈవెంట్‌లో కంపెనీ రిలీజ్‌ చేయగా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హ్యాండ్‌సెట్ అధికారిక ట్రైలర్‌ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

టాప్-ఎండ్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తో సింగిల్ మోడల్‌లో OnePlus 11ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే 3C సర్టిఫికేషన్‌ను పొందింది. """/"/ లిస్టింగ్ ప్రకారం.

ఈ స్మార్ట్‌ఫోన్ 100 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌‌ను కలిగి ఉండొచ్చు.అలాగే ఇది 5V/2A, 5-11V/9.

1A పవర్ అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేసే డిజైన్‌తో రాబోతుందని అంచనా.OnePlus 11 టాప్‌లో పంచ్-హోల్ కెమెరా కట్‌ వుండబోతోంది.

ట్రిపుల్ కెమెరా సెటప్‌.50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2x 32MP టెలిఫోటో లెన్స్‌తో రావచ్చు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కాబోతోంది.ఇక బ్యాటరీ 5,000mAh కలిగి వుంటుందట.

ఫారెస్ట్ ఎమరాల్డ్, వోల్కానిక్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వివరాలకు కంపెనీ అధికారిక సైట్ చూడగలరు.

వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?