కరోనా వైరస్ గురించి పుకార్లు పుట్టిస్తే అది తప్పదు...

ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఈ ప్రపంచంలో ఇలా ఎక్కడ చూసినా కూడా కరోనా వైరస్ మంత్రం జపిస్తున్నారు.

అయితే అందుకు గల కారణాలు లేకపోలేదు.ఎక్కడో చైనా దేశంలో పుట్టినటువంటి కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోను తీవ్రంగా కలవరపెడుతోంది.

అంతేకాక ఇప్పటికీ ఈ వైరస్ కి భయపడి మన దేశంలో కూడా పలు రంగాల్లో సెలవులు కూడా ప్రకటించారు.

అంతేగాక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు పలురకాల చర్యలు కూడా తీసుకుంటున్నాయి.

అయితే ఈ కరోనా వైరస్ మెల్లమెల్లగా రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడంతో కొందరు వ్యక్తులు ఈ వైరస్ పై లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారు.

దీని వల్ల సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు రాష్ట్రంలో ఎవరైనా ఈ కరోనా వైరస్ పై లేనిపోని పుకార్లు పుట్టించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తే కటకటాలు పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

అంతే కాక ఇలాంటి పుకార్లు పుట్టించిన వారికి సంవత్సరకాలం పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని చెబుతున్నారు.

"""/"/ అయితే ఇటీవలే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు 31వ తారీకు వరకు సెలవులు కూడా ప్రకటించింది.

అయితే కొన్ని పాఠశాలలు మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నాయని ఇకనైనా సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించాలని లేకపోతే అటువంటి పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం మాత్రం దేశ మరియు రాష్ట్ర ఆర్థిక రంగాలపై బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి చిరు వ్యాపారులు ఈ కరోనా వైరస్ వల్ల గిరాకీ లేక ఖాళీగా గడుపుతున్నారు.

అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. విచారణకు దూరంగా కాంగ్రెస్ నేతలు