రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్షతో పాటు 3000-/ రూపాయల జరిమానా.
TeluguStop.com
రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్షతో పాటు 3000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ గురువారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.
ఐ శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వివరాల ప్రకారం 2018 జూన్ 12 వ తేదీన ఎల్లారెడ్డిపేట కి చెందిన మాలోతు తుకారాం తన స్నేహితుడు భూక్య శ్రీనివాస్ తో కలిసి కారులో సిద్దిపేటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో శ్రీనివాస్ కారు డ్రైవింగ్ చేస్తుండగా తుకారాం ప్రక్కన కూర్చున్నాడు.
శ్రీనివాస్ అనే వ్యక్తి కారుని అతి వేగంగా నడపడం వలన ముస్తాబాద్ మండలం బధనకల్ గ్రామం వద్ద కారు బోల్తా పడగ ఈ ప్రమాదంలో తుకారాం తీవ్రంగా గాయపడ్డాడు.
ఇట్టి సంఘటనపై ముస్తాబాద్ పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ శ్రవణ్ యాదవ్ మరియు కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ గారు నేరం రుజువు కావడంతో నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష,3000-/ రూపాయల జరిమాన విధించినట్లు ముస్తాబద్ ఎస్.
ఒంట్లో సత్తువ పెంచే జ్యూస్ ఇది.. రోజు ఉదయం తాగితే మీకు తిరుగేలేదు!