ఉగ్రవాదం నల్ల తోలు కప్పుకున్న రక్కసి అని చెప్పవచ్చూ.దీని బారిన పడిన ఎందరో భారతీయులు అసువులు బాసారు.
అదీగాక ఈ ఉగ్రవాదం వల్ల అమెరికాలో కూడా చాలామంది మరణించారు.ఇక ఈ ఉగ్రవాదం వల్ల ఎన్నో అనర్ధాలు, మరణకాండలు దేశంలో జరిగాయి, జరుగుతున్నాయి.
అంతం లేని ఈ అంశం వల్ల ఇంకెన్ని ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియదు.ఇకపోతే పాకిస్దాన్ ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ప్రచారంలో ఉంది.
ఉగ్గుపాల నుండే ఉగ్రవాదాన్ని రంగరించి పసిమనసుల్లో విద్వేషాలను నింపుతారట ఆ దేశంలో.అందుకే అక్కడి నుండే మానవ బాంబులు తయారై ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తాయని అంటారు.
ఇక శ్రీనగర్ లో ఓ టెర్రరిస్ట్ రెచ్చిపోయాడట.ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపగా, అక్కడున్న స్దానికులు భయంతో పరుగులు పెట్టారట.
కాగా ఈ ఘటన భగత్ బర్జుల్లా ఏరియాలో జరిగిందట.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఫోర్స్ పై, ఆ ఉగ్రవాది ఏకే-47 తో కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడని సమాచారం.
అయితే ఈ ఘటన నేపథ్యంలో ఆర్మీ అప్రమత్తమైందట.
భారతీయ విద్యార్ధులపై ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల ఆంక్షలు.. ఎందుకంటే..?