క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి – ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ,సివిల్ పోలీస్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది.

ఈ పరేడ్ కి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్,సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని.

రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందన్నారు.

క్రమశిక్షణ తో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లా కి మంచి పేరు తెచ్చే లాగా పని చేయాలని అన్నారు.

సిబ్బందికి ఏదైనా సమస్యతో వుంటే ఎప్పుడైనా తనను కలుసుకొని తమ సమస్యను తెలియజేసుకోవచ్చని అన్నారు.

ఫిర్యాదులు/ సమాచారం/ సహాయం కోసం మనదగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి తగు సేవలు అందించడంతో ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం విశ్వాసం పెరుగుతుంది అన్నారు.

ఈ పరేడ్ లో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు యాదగిరి,మధుకర్, సి.

ఐ లు ఉపేంద్,రవీందర్, ఎస్.ఐ లు ఆర్.

ఎస్.ఐ లు,ఆర్ముడ్ సిబ్బంది, సివిల్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?