ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..: మంత్రి కాకాణి

మిచాంగ్ తుపాను ప్రభావంపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్థన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అయితే రేపు కావలి - బాపట్ల మధ్య తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి కాకాణి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే వర్షం ప్రభావంతో ఇప్పటికే కూలిన విద్యుత్ పోల్స్, చెట్లను తొలగించాలని సూచించారు.

మంత్రి కాకాణి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖాధికారులను అలర్ట్ చేశారు.

ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!