ఒకరిపై ఒకరు ..ఎన్నికల సంఘానికి ఫిర్యాదులే ఫిర్యాదులు

ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు,  ప్రతి విమర్శలు మరింత తీవ్రం అవుతున్నాయి.

ఒక పార్టీపై మరో పార్టీ పై చేయి సాధించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఒక పార్టీపై మరొక పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి .ముఖ్యంగా ఒక పార్టీలోని కీలక నేతలపై మరో పార్టీ నాయకులు ఫిర్యాదులు చేయడం ఆనవాయితీగ మారింది.

ప్రతి ఎన్నికల్లోను ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం సర్వసాధారణమే అయినా.  ఈసారి మాత్రం ఈ ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది .

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచే వైసిపి,  తెలుగుదేశం ( YCP, Telugu Desam )పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

"""/" / చంద్రబాబు, పవన్( Chandrababu, Pawan ) లతో పాటు,  ఇతర టిడిపి నేతల కామెంట్లు,  సోషల్ మీడియా కామెంట్లపై అధికార పార్టీ వైసిపి ఫిర్యాదులు చేస్తోంది.

ఇప్పటి వరకు 150కు పైగా వైసిపి ఫిర్యాదులు ఇచ్చింది.దొంగ ఓట్లు మొదలుకుని అధికార దుర్వినియోగం వరకు టిడిపి వరుసగా ఫిర్యాదులు చేస్తోంది.

దొంగ ఓట్ల వ్యవహారంలో ఐఏఎస్ లతో సహా కొందరు అధికారుల సస్పెన్షన్ వరకు వ్యవహారం వెళ్ళింది.

అలాగే వాలంటీర్లు వ్యవహారం నుంచి సి ఎస్ , డీజీపీ , ఇంటిలిజెన్స్ డీజీ మీద టిడిపి ఫిర్యాదులు చేసింది.

ఈ ఫిర్యాదులపై భారీగా ఐఏఎస్,  ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది .

"""/" / త్వరలోనే డిజిపి,  చీఫ్ సెక్రటరీలు ( DGP, Chief Secretaries )కూడా బదిలీ అవుతారనే ప్రచారం జరుగుతోంది అలాగే జగన్ తో సహా మిగిలిన మంత్రులు,  వైసిపి కీలక నేతల కామెంట్స్ పై టిడిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది .

ఇప్పటి వరకు రెండు వందలకు పైగా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులను ఎన్నికల సంఘానికి ఇచ్చింది.

అలాగే సిఎస్ , డీజీపీ లపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వివరణ కూడా తీసుకుంది.

అలాగే టిడిపి ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వివరణ కోరుతుంది .సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల సంఘానికి వచ్చిన వివిధ ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని 100కు పైగా నోటీసులు ఎన్నికల సంఘం జారీ చేసింది.

ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ క్యారెక్టర్ ఇదే.. నరరూప రాక్షసుడిగా కనిపిస్తారా?