ఆర్ఆర్ఆర్ లీక్.. చైల్డ్ ఆర్టిస్ట్ ఇలా ఉన్నాడు!

తెలుగు సినిమా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో ఇద్దరూ తెలుగు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా పై అటు అభిమానులు, ఇటు తారక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలియజేశారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి కొన్ని సన్నివేశాలు లీక్ అవుతూ ఉండటం సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో లీక్ అయింది.

"""/"/ ఈ సినిమాలో ధృవన్ అనే కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.

తాజాగా ధ్రువన్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక పోస్ట్ చేశారు.

ఆ ఫోటోలో తలకు కండువా కట్టుకొని, పంచ కట్టులో ఉన్న ధ్రువన్ ఆ ఫోటోను షేర్ చేస్తూ అది ఆర్ఆర్ఆర్ సెట్ లోని ఫోటో అంటూ చెప్పడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఈ పాత్ర ఎన్టీఆర్ కొమరం భీమ్ చిన్నప్పటిదని భావించగా, మరికొందరు అల్లూరి సీతారామరాజు పాత్ర అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఎవరి పాత్రలో నటిస్తున్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందేనని చెప్పవచ్చు.

ధనవంతులను ఎలా పెళ్లి చేసుకోవాలో ఐడియాలు ఇస్తూ.. కోట్లు సంపాదిస్తోంది..!