మెగాస్టార్ ఫ్యాన్స్ కు తీపికబురు.. చిరుకు జోడీగా ఆ హీరో భార్య నటించనున్నారా?

అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా థియేటర్లలో, ఓటీటీలో, బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే చిరంజీవి( Chiranjeevi ) అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తాజాగా ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండటం గమనార్హం.

ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్టాఫ్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశారని సమాచారం అందుతోంది.

ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన డైలాగ్ వెర్షన్ ను సైతం ఇప్పటికే పూర్తి చేశారని భోగట్టా.

2026 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

జూన్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని భోగట్టా.సెకండాఫ్ కు సంబంధించి వర్క్ మొదలు కావాల్సి ఉంది.

"""/" / ఈ సినిమా కోసం సిద్దార్థ్( Siddharth ) భార్య అదితీరావు హైదరీ( Aditirao Hydari ) పేరును పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ఒకవేళ ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని పక్షంలో మరి కొందరు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం అందుతోంది.

చిరంజీవి అనిల్ కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / చిరంజీవి ఫ్యాన్స్ కోరుకుంటున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో దక్కడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి వయస్సు పెరుగుతుండగా వయస్సు పెరుగుతున్నా మెగాస్టార్ తన ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

వేగంగా సినిమాలలో నటించడానికి చిరంజీవి ప్రాధాన్యత ఇస్తున్నారు.మెగా హీరోలకు రాబోయే రోజుల్లో వరుస విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.

రెచ్చగొట్టొద్దు దమ్ముంటే స్టేజ్ మీదకు రా… మాస్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?